ఆల్కాహాల్ అనుకొని.. శానిటైజర్ తాగి ఖైదీ మృతి.

ఓ ఖైదీ జైలు రిమాండ్ లో ఉండి.. ఆల్కాహాల్ అనుకొని శానిటైజర్ తాగి మృతి చెందిన ఘటనపై అనుమానాలు రేగుతున్నాయి. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్‌ జైలులో జరిగింది. రమణ్‌ కుట్టి అనే వ్యక్తి కొంతకాలంగా రిమాండ్‌‌లో ఉన్నాడు. ఇతడిని పాలక్కాడ్‌ జైలులో ఉంచారు. అలాగే.. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా చేతులను శుభ్రపర్చుకొనేందుకు ప్రతి చోటా శానిటైజర్లను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే జైలులోనూ ప్రతి చోట శానిటైజర్లను ఉపయోగిస్తున్నారు. దీంతో శానిటైజర్లకు ఏమాత్రం తక్కువ కాకుండా జైళ్లలో ఖైదీలు చేసే పనిలో భాగంగా శానిటైజర్లు కూడా తయారు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది.

అదేవిధంగా ఇందులో భాగంగా శానిటైజర్‌లను తయారు చేయాలని పాలక్కాడ్‌ జైలు అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం ముడి సరకును ఏర్పాటు చేసుకొని ఖైదీలు శానిటైజర్‌ను తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు. శానిటైజర్లను తయారు చేస్తుండగా.. దాని తయారీలో వాడే ప్రముఖమైన పదార్థం ఐసోప్రొఫేల్‌ ఆల్కహాల్‌ను రిమాండ్‌‌లో ఉన్న ఖైదీ రమణ్‌ కుట్టి అనే వ్యక్తి తాగేశాడు. అది తాగిన వెంటనే నేలపై పడి కొట్టుకున్నాడు. జైలు అధికారులు రమణ్ కుట్టిని వెంటనే పాలక్కాడ్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఖైదీ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఖైదీ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.