కాపు రిజర్వేషన్ మీద పార్లమెంట్ లో బిల్…!

Private Bill For Kapu Reservations In Parliament

గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు కాపు రిజర్వేషన్ చుట్టూ తిరుగుతున్నాయి, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఈ విషయం మీద నేనేమీ చేయలేను ఇది మన చేతిలో ఉండే అంశం కాదు కాబట్టి నేనేమీ చేయలేనన్ని అనడం ఆ తర్వాత జరిగిపోతున్న నష్టం తెలుసుకుని మాట మార్చాను మడమ తిప్పను అనే ఆయన మాట మార్చి మరలా మేము కాపు రిజేర్వేషన్ కి కట్టుబడి ఉంటానని ప్రకటించడంతో ఈ కాక మరింత పెరిగినట్టయ్యింది. అయితే, ఇదే అంశం మీద ఎప్పటి లాగానే పవన్ కళ్యాన్ ఒక కమిటీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తే పార్లమెంట్ లో విభజన హామీల మీద పోరాడుతున్న ఎంపీలు ఈ అంశం మీద కూడా పోరాటం మొదలు పెట్టారు. ఎందుకంటే సుమారు 9 నెలల క్రితమే కాపుల రిజర్వేషన్లపై రాష్ట్రము నుండి చట్టం చేసి కేంద్రానికి పంపించింది ఏపీ ప్రభుత్వం.

అలాగే అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేసేసింది కానీ తొమ్మిది నెలల నుండి అదే అంశాన్ని మిగతా హామీల లాగానే కేంద్రం పక్కన పడేసింది. దీంతో ఇప్పుడు ఏపీలో కాపు రిజేర్వేషన్ల అంశం మళ్ళీ రేగడం ముద్రగడ ఇంట్లో కాపు జేఏసీ మీటింగ్ తదితరాల నేపధ్యంలో ఎలా అయినా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దాని మీద పార్లమెంట్ లో చర్చ జరిగేలా చూసేందుకు మొన్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ జీరో అవర్‌లో ఈ రిజర్వేన్ల అంశాన్ని చర్చకు తెచ్చారు. ఈ రిజర్వేషన్ల విషయం ఆమోదించి. షెడ్యూల్ 9లో కాపుల్ని చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే నిన్న ఇదే అంశం ప్రైవేట్ మెంబర్ బిల్‌ను కూడా ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేసపెట్టాక బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టాల్సి వచ్చిందో సభలో వివరించారు. అలాగే ఈ బిల్ మీద చర్చ చేపట్టాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు. ఈ బిల్లుపై చర్చ ఎప్పుడు.. ఎంత సమయం కేటాయించాలనేది వచ్చేవారంలో జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ప్రైవేటు మెంబ‌ర్ బిల్లు స‌భ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశాలున్నాయా అనేదే అనుమానంగా మారింది!