పీక్‌ అవర్స్‌ పేరుతో బాదుడు

పీక్‌ అవర్స్‌ పేరుతో బాదుడు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకారణంగా పీక్‌ అవర్స్‌ పేరుతో ఎక్కువ చార్జీలు వసూలుచేస్తు క్యాబ్‌ సంస్థలు దాదాపు దాదాపు రెండింతలు సొమ్ము చేస్కుంటున్నాయి.ఉబెర్,ఓలాలాంటి క్యాబ్‌సంస్థలకి రవాణాశాఖ సర్‌చార్జీలు, పీక్‌ అవర్స్‌ అని చార్జీలు పెంచకూడదని స్పష్టం చేసిన ప్రయాణికుల డిమాండ్‌ వల్ల అందుబాటులో బస్సులు సరిగా ఉండకపోవడం వల్ల క్యాబ్‌నిర్వాహకులు చాలా సొమ్ము చేసుకుంటున్నారు.

తాత్కాలిక డ్రైవర్లతో నడుస్తున్న సిటీ బస్సులు రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటలలోపే డిపోలకు చేరుకుంటున్నాయి. నైట్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేయడంతో  ఇష్టారాజ్యంగా ఆటోవాళ్ళు కూడా చార్జీలు వసూలు చేస్తున్నారు.హైటెక్‌సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్‌డిస్ట్రిక్ట్, కొండాపూర్ కి వెళ్ళే ఉద్యోగులు బస్సుల సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది. ఆయా మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అందుబాటులో ఉండాల్సిన  సిటీ బస్సులు సమ్మె కారణంగా లేకపోవడంతో క్యాబ్‌లకు  మరింత డిమాండ్‌ పెరిగింది.