వాలుకళ్ల సుందరి సుప్రీం వరకు వెళ్లింది

Priya Prakash Varrier Seeks Supreme Court To Stay Criminal Proceedings
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రంలోని పాటలో తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ ప్రియా వారియర్‌ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అత్యధిక గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్‌గా పేరు పొందింది. ప్రియా వారియర్‌ కన్ను కొట్టడం, ముద్దు గన్‌ పేల్చడంతో కుర్రకారు గుండెలు పలిగి పోయాయి. కొందరు ఈమె హావభావాలకు ఫిదా అవుతుంటే మరి కొందరు మాత్రం తమ మనోభావాలు దెబ్బ తీన్నాయి అంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ పాట తమను కించపర్చే విధంగా ఉంది అంటూ హైదరాబాద్‌లో కేసు నమోదు అయ్యింది. ఇంకా పలు ప్రాంతాల్లో కూడా ఈ చిత్ర దర్శకుడిపై, ప్రియా వారియర్‌పై కేసులు పెట్టారు. 

వచ్చిన క్రేజ్‌ను ఎంజాయ్‌ చేయకుండా ప్రియా వారియర్‌పై బ్యాక్‌ టు బ్యాక్‌ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఆమెలో టెన్షన్‌ మొదలైంది. ఆ కేసులన్ని ఎత్తి వేయాలంటూ ప్రియా వారియర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తాను చేసిన పాటతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ పాటలో ముస్లీంలను కాని, ఏ ఒక్కరిని కాని కించపర్చలేదు అంటూ ప్రియా వారియర్‌ కోర్టుకు తెలియజేసింది. తన హక్కులకు బంగం కలిగించేలా తనపై కేసులు పెట్టారు అని, దేశంలో ఎక్కడెక్కడ తనపై ఈ విషయమై కేసులు పెట్టారో ఆ కేసులన్నింటిని కొట్టి వేయాలి అంటూ ప్రియా వారియర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు త్వరలోనే విచారణ మొదలు పెట్టబోతుంది. ఈ విషయమై ప్రియా వారియర్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుందని, ఆమెపై ఉన్న కేసులు అన్ని కూడా ఎత్తి వేయాల్సి వస్తుందని ఆమె తరపు లాయర్‌ చెప్పుకొచ్చాడు.