ఇలియానా, తాప్పీ, ర‌కుల్ బాట‌లో రెజీనా

Regina Cassandra Gets Bollywood Movie Chance
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతూనే బాలీవుడ్ పైనా ఓ క‌న్నేస్తున్నారు మ‌న స్టార్ హీరోయిన్లు. తెలుగులో ఓ వెలుగు వెలుగుతోన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం బాలీవుడ్ పైనే ఎక్కువ కాన్ స‌న్ ట్రేష‌న్ చేస్తోంది. టాలీవుడ్ లో కాస్త అవ‌కాశాలు త‌గ్గినా… త‌మిళంలో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న రెజీనా కూడా ఇప్పుడు బాలీవుడ్ బాట ప‌ట్టింది. గ‌తంలోనే ఆమెకి ఆంఖేయిన్ 2లో అవ‌కాశం వ‌చ్చిన‌ప్ప‌టికీ… కొన్ని కార‌ణాల‌తో అది మిస్స‌య్యింది. తాజాగా మరో బాలీవుడ్ ఆఫ‌ర్ ఆమె త‌లుపుత‌ట్టింది.

రాజ్ కుమార్ రావ్… అనిల్ క‌పూర్, జుహీ చావ్లా ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఏక్ ల‌డ్కికో దేఖ‌తో ఐసా ల‌గా సినిమాలో ఆమెకు అవ‌కాశం ద‌క్కింది. చాలామంది హీరోయిన్ల‌కు ఆడిష‌న్ నిర్వ‌హించిన ద‌ర్శ‌కుడు షెల్లీ చోప్ర‌ధ‌ర్ రెజీనానే ఖ‌రారు చేశారు. ఈ సినిమా హిట్ట‌యితే రెజీనాకు బాలీవుడ్ లో మ‌రిన్ని ఛాన్స్ లు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ద‌క్షిణాది నుంచి బాలీవుడ్ వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్ర‌ముఖ హీరోయిన్ ఆసిన్ తెలుగు, త‌మిళ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న త‌ర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి… అక్క‌డా స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. గోవా బ్యూటీ ఇలియానా, ఢిల్లీ బ్యూటీ తాప్సీ వంటి వారు కూడా తెలుగు సినిమాల‌తో వ‌చ్చిన గుర్తింపు ద్వారానే బాలీవుడ్ లో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్నారు.