‘బాలకృష్ణుడు’తో సమంతకు సంబంధం ఏంటి?

samantha attended balakrishnudu movie audio launch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నారా రోహిత్‌, రెజీనా కాసాండ్ర జంటగా తెరకెక్కిన ‘బాలకృష్ణుడు’ చిత్రం మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో నారా రోహిత్‌ గత చిత్రాలతో పోల్చితే పూర్తి విభిన్నంగా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అక్కినేని వారి ఇంటి కొత్త కోడలు సమంత పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. నారా రోహిత్‌ సినిమాకు సమంత ప్రత్యేక గెస్ట్‌గా ఎలా వచ్చిందని అంతా కూడా షాక్‌ అయ్యారు. అయితే అసలు విషయం ఏంటీ అంటే బాలకృష్ణుడు చిత్రాన్ని నిర్మిస్తున్న గిరిధర్‌ కారణంగా సమంతతో పాటు పలువురు హీరోలు మరియు హీరోయిన్స్‌ వచ్చారు.

balakrishnudu-movie-audio-l

గిరిధర్‌ ఇండస్ట్రీలో మంచి పేరున్న మేనేజర్‌. సినిమా సెలబ్రెటీల డేట్లు చూడటంతో పాటు, వారి ఈవెంట్స్‌కు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటాడు. సమంతకు చాలా కాలం పాటు మేనేజర్‌గా గిరిధర్‌ చేశాడు. సమంత కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు చాలా ప్లాన్డ్‌గా ఆమె డేట్లను కేటాయించేవాడు. అందుకే సమంతకు గిరిధర్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానంతోనే గిరిధర్‌ నిర్మాతగా మారిన మొదటి సినిమా వేడుకలో పాల్గొంది. సమంతతో పాటు రాశిఖన్నా, నాగశౌర్య, సాయి ధరమ్‌ తేజ్‌, వెన్నెల కిషోర్‌ ఇంకా పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. సమంత ఈ ఈవెంట్‌లో పాల్గొనడంతో అంచనాలు ఆకాశానికి తాకాయి. సినిమాకు పబ్లిసిటీ ఫుల్‌గా వచ్చేసింది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.