ప్రియా వారియర్‌కు ఆ రకంగా కూడా..!

Priya Prakash Warrior Craze in a brand ambassador
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తన కను చూపుతో యావత్‌ దేశాన్ని ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఒక్కసారిగా సూపర్‌ స్టార్‌ అయ్యింది. ప్రస్తుతం ఈమెకు సౌత్‌లోనే కాకుండా ఉత్తరాది నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఆమె నటించిన మొదటి చిత్రంతోనే భారీ క్రేజ్‌ను దక్కించుకున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈమెకు వచ్చిన క్రేజ్‌తో పారితోషికం అమాంతం పెంచేసింది. ఇక కమర్షియల్‌ యాడ్స్‌లో కూడా ప్రియా ప్రకాష్‌ వారియర్‌కు నటించే అవకాశం వస్తుంది. ఒక ప్రముఖ కంపెనీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌తో ఏకంగా అయిదు కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మలయాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

టాప్‌ సెలబ్రెటీలు అయితే తప్ప ప్రముఖ ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం రాదు. కాని ప్రియా ప్రకాష్‌ వారియర్‌కు భారీ ఎత్తున వచ్చిన క్రేజ్‌తో ఆ కంపెనీ ప్రముఖ హీరోయిన్స్‌ను కూడా పక్కకు పెట్టి ప్రియా ప్రకాష్‌ వారియర్‌తో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించుకునేందుకు సిద్దం అయ్యారు. గతంలో ఒక ప్రముఖ హీరోయిన్‌కు నాలుగు కోట్ల పారితోషికం ఇచ్చిన సదరు కంపెనీ ఇప్పుడు ప్రియాకు ఏకంగా అయిదు కోట్లను ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ ఒక్క కంపెనీ మాత్రమే కాకుండా కేరళ లోకల్‌ కంపెనీలతో పాటు పలు జాతీయ స్థాయం కంపెనీలు కూడా ప్రియాతో ప్రమోషన్‌ చేయించుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్‌గానే కాకుండా బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా భారీగా సంపాదిస్తుంది.