సోషల్ మీడియా ఖాతాల నుంచి గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ ఇంటి పేరు తొలగించడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా జోనస్ అని ఉండే తన ప్రోఫైల్ నేమ్‌లో ప్రియాంక చోప్రా అని మాత్రమే ఉంచి చోప్రా, జోనస్ పేరు తీసేసింది. అది చూసి అందరూ షాకయ్యారు. దీని అర్థం ఏంటి త్వరలోనే ఈ స్టార్ కపుల్స్ విడిపోనున్నారా? విడాకులకు ఇది సంకేతమా? అంటూ మూడు రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అచ్చం ఇలానే ఇటీవల విడిపోయిన టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంత మధ్య జరగడంతో ఈ రూమర్లకు బీజం పడింది. అయితే ఈ వార్తలపై ఇప్పటికే ప్రియాంక తల్లి మధు చోప్ర స్పందిస్తూ ఖండించింది. ఇక ప్రియాంక సైతం ఓ వీడియో షేర్ చేసి వారి విడాకులపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇవ్వకనే ఇచ్చింది. అయినా నిక్-ప్రియాంక విడాకులు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. దీంతో తాజాగా ఈ జంట ఈ పుకార్లపై స్పందించింది.
ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రూమార్లకు చెక్ పెట్టారు. ఈ ఫొటోను నిక్ షేర్ చేస్తూ.. ‘అందరికి థ్యాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు! ప్రియాంక మీకు కూడా కృతజ్ఞతలు’ అంటూ ఫొటో షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది చూసి గ్లోబల్ కపుల్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంటే ‘వారు విడిపోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నమాట’ అంటూ క్లారిటీ ఇచ్చిన నిక్‌కు అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దీంతో ‘మీరు ఎపుడు ఇలాగే హ్యాపీ ఉండాలి’, ‘క్యూట్ కపుల్’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే ప్రియాంక కూడా అదే ఫొటోను షేర్ చేస్తూ ‘చాలా కృతజ్ఞతతో ఉన్నాను. లవ్ నిక్ జోనస్. థ్యాంక్స్ గివింగ్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చింది. చూస్తుంటే ఈ జంట తమ విడాకులపై వస్తున్న రూమార్లకు ఈ ఫొటోతో ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది. కాగా నిక్-ప్రియాంక 2018 డిసెంబర్ 1న పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.