టికెట్ టూ ఫినాలే రేసులో నిలిచేందుకు హౌస్మేట్స్ పోటీపడుతున్నారు. గత రెండు రోజులుగా వరుసపెట్టి టాస్కులు పెట్టడంతో ఆటను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు బిగ్ బాస్. ఇప్పటికే ఫినాలే రేసు నుంచి శివాజీ, యావర్, ప్రియాంక, శోభా అవుట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. వాళ్ల పాయింట్లను తమకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అని చెప్పడంతో శివాజీ, శోభా ఇద్దరూ అమర్‌కు ఇవ్వగా.. ప్రియాంక గౌతమ్ కు, యావర్.. ప్రశాంత్ కు ఇచ్చారు . దీంతో మొదటి స్థానంలో అమర్, రెండవ స్థానంలో ప్రశాంత్, మూడవ స్థానంలో అర్జున్, నాల్గవ స్థానంలో గౌతమ్ ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురి మధ్యన టికెట్ టూ ఫినాలే రేసు నడుస్తుంది . తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్, శోభాలకు ఒక్క మాటతో బుద్దిచెప్పాడు డాక్టర్ బాబు. దీంతో దెబ్బకు సైలెంట్ అయ్యాడు అమర్. ఇంతకీ ఈరోజు విడుదలైన ప్రోమోలో ఏం జరిగిందో చూద్దామా.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. చివరి స్థానంలో ఉండడంతో గౌతమ్ టికెట్ టూ ఫినాలే రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో అతని స్కోర్ నుంచి సగం పాయింట్స్ నచ్చినవారికి ఇవ్వాలని చెప్పాడు బిగ్ బాస్. అయితే గౌతమ్ .. అర్జు్న్ కు ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ప్రియాంక రిక్వెస్ట్ చేయడంతో మనసు మార్చుకుని తన పాయింట్స్ అమర్ కి ఇచ్చేశాడు. తాను సాధించిన మొత్తం పాయింట్లలో 20 శాతం అంటే 140 పాయింట్స్ అమర్ కి ఇచ్చాడు. అయితే ఇస్తూ ఇస్తూ.. అమర్ వైపు చూస్తూ ‘రేయ్.. ఇవి ప్రియాంక పాయింట్స్. ఇంకోసారి ప్రియాంకను ఇవ్వలేదని అనకు’ అంటూ కౌంటరిచ్చాడు. దీంతో అమర్ దీప్ సైలెంట్ అయ్యాడు. కానీ మధ్యలో దూరిపోయిన శోభా శెట్టి ..మరోసారి ఇద్దరి మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేసింది. ‘ఇస్తున్నాని చెప్పు.. ఇంకోసారి ఏమి అనొద్దని అనడం కరెక్ట్ కాదు’ అంటూ స్పీచ్ ఇచ్చింది.
అయితే అప్పటివరకు గౌతమ్ పై నమ్మకంతో ఉన్న అంబటి అర్జున్.. పాయింట్స్ రాకపోవడంతో నిరాశకు గురయ్యాడు. గార్డెన్ ఏరియాలో ఒక పక్కనే సైలెంట్ గా కూర్చుని ఉండగా.. అతని పక్కనే ఉన్న శివాజీ.. “అనుకున్నది ఒక్కటీ.. అయినది ఒక్కటీ.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా’ అని అంటూ పాట అందుకున్నాడు. అమర్, ప్రియాంకకు గొడవ జరిగినప్పుడు అర్జున్ సైతం ఇలాగే బిహేవ్ చేశాడు. ప్రియాంక వాష్ రూం దగ్గర ఏడుస్తుంటే..అర్జున్ వెళ్లి.. చిలకా ఏ తోడు లేక అని అంటూ పాట పాడాడు. ఇప్పుడు అర్జున్ దగ్గర శివాజీ అనుకున్నది ఒక్కటీ అయినది ఒక్కటీ అంటూ పాట పాడాడు. మొత్తానికి ఫినాలే రేసు నుంచి ఇంకొకరు అవుట్ కాగా.. ఇప్పుడు అమర్, అర్జున్, ప్రశాంత్ ల మధ్య పోటీ ఉండనుంది.