Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిందీ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ జీ స్టూడియోస్ ఆధ్వర్యంలో జరిగిక ఒక కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 5 నిమిషాల డాన్స్ షో చేసింది. ఆ 5 నిమిషాల పెర్ఫార్మెన్స్కు మంచి పేరు వచ్చింది, ఆ షో కూడా చాలా మంచి సక్సెస్ అయ్యింది. ఇక ఆ డాన్స్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ పారితోషికం ప్రస్తుతం జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రియాంక చోప్రా స్వయంగా స్పందించింది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను కష్టపడి చేశాను కనుక ఆ పారితోషికంను ఇచ్చారు. ఈ విషయాన్ని హీరోతో మాట్లాడతారా, ఒక వేళ హీరో అంత పారితోషికం తీసుకున్నట్లయితే ఎందుకు ప్రశ్నించరు అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తన ఇమేజ్‌కు తగ్గట్లుగా పారితోషికం తీసుకుంటాను అని, అందులో ఎలాంటి అనుమానం లేదు అంటూ ప్రియాంక చోప్రా కుండబద్దలు కొట్టింది. తన కెరీర్ ఆరంభంలో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. అయిదు నిమిషాల డాన్స్ అంటున్నారు, ఆ అయిదు నిమిషాల కోసం ఎన్ని గంటలు కష్టపడాలో మీకు తెలియదా అంటూ మీడియాను ప్రశ్నించింది. కష్టపడ్డప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం తీసుకోవడంలో తప్పేంటి అంటూ ప్రియాంక ప్రశ్నిస్తుంది. హీరోలు పెర్ఫార్మెన్స్ చేసి ఇదే స్థాయిలో పారితోషికంను తీసుకుంటే అప్పుడు మీరేమైనా ప్రశ్నిస్తారా, వారి వద్దకు వెళ్లి ఇంత పారితోషికం ఎలా తీసుకుంటారు అంటూ అడిగే సత్తా ఉందా అంటూ ప్రియాంక చోప్రా ప్రశ్నించింది. మొత్తానికి ప్రియాంక చోప్రా వాదనతో కొందరు మీడియా వారు కూడా ఏకీభవించి అవును కదా అనుకున్నారట.