భర్తతో లండన్ వీధుల్లో గొడవపడ్డ ప్రియాంక

భర్తతో లండన్ వీధుల్లో గొడవపడ్డ ప్రియాంక

తన అందచందాలతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా ‘క్వాంటికో’ సిరీస్‌తో హాలీవుడ్‌లో సైతం మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌జొనాస్‌తో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో 2018లో వివాహం చేసుకుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే ఈ జంట ఎక్కడికెళ్లినా అందరినీ ఆకర్షిస్తుంటారు.

అయితే ప్రియాంక చోప్రా సడెన్‌గా తన భర్తపై తీవ్ర అసహనానికి గురయ్యారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగడంతో ప్రియాంక భర్తను కారులో నుంచి దించేసింది. అందరూ చూస్తుండగానే ఈ జంట లండన్ వీధుల్లో గొడవపడ్డారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. వారిద్దరు నిజంగా గొడవపడ్డారనుకుంటే పొరపాటే.

ప్రియాంక ప్రస్తుతం కొత్త సినిమా ‘టెక్ట్స్ ఫర్ యూ’ షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో ఆమె భర్త నిక్‏ జోనాస్‏ అతిథి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని సన్నివేశాలను లండన్‏లో చిత్రీకరించారు. షూటింగులో భాగంగానే తనతో పాటు కారులో ప్రయాణిస్తున్న నిక్‏తో ప్రియాంక గొడవపడడం, ఆ తర్వాత అతడిని కారు నుంచి దిగి వెళ్లిపొమ్మని చెప్పడం వంటి సీన్లు చిత్రీకరించారు.