అందరూ ఊహించినట్టుగానే బిగ్‌బాస్ 13వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ప్రియాంక సింగ్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ ఫినాలే వైపు అడుగులెస్తోంది. మొదటి ఫినాలే కంటెస్టేంట్‌గా శ్రీరామ్ ఎన్నికయ్యాడు. ఇక హౌజ్‌లో మానస్, శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, కాజల్, సిరిలు మాత్రమే ఉన్నారు. ఇక ఎలిమినేట్ అయిన ప్రియాంక అరియానతో బిగ్‌బాస్ బజ్‌లో ముచ్చటించింది. హౌజ్‌లో ఉన్నంత కాలం మానస్ జపం చేసిన పింకీ బయటకు వచ్చాక కూడా మానస్ పేరునే కలవరించింది. ఈ క్రమంలో ఆమె హౌజ్‌లోని కంటెస్టెంట్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎవరూ గెలుస్తారని అరియాన అడగ్గా మానస్ పేరు చెప్పింది. దీంతో అరియాన ఆమె కళ్లు తెరిపిస్తూ పింకీకి ఓ షాకింగ్ వీడియో చూపించింది.
అది చూసి ప్రియాంక భావోద్యేగానికి లోనవుతూ కంటితడి పెట్టుకోగా అరియాన సైతం ఆమెను హత్తుకుని ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మానస్, కాజల్.. ప్రియాంక గురించి మాట్లాడుకుంటున్నా వీడియోను అరియానా చూపించింది. ఆ వీడియో చూసి షాకైన పింకీ.. ‘మానస్ చాలా సారీ.. ఇది నీ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు’ అంటూ చెప్పుకోచ్చింది. మానస్‌కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడగ్గా.. మానస్ గురించి నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే.. ఎవరినైనా చదివి పక్కనపెట్టేస్తాడు. నాకు పిల్లలుంటే ఎలా చూసుకునేదాన్నో అలాగే చూసుకుంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక.
ఇక అరియానా ఇచ్చిన టాస్కులో డౌన్ తంబ్ సింబల్ కాజల్‌కు ఇవ్వగా.. లవ్ సింబల్ శ్రీరామచంద్రకు ఇచ్చింది. పంచ్ సింబల్ మాత్రం మానస్‌కు ఇచ్చి షాకిచ్చింది పింకీ. అలా ఎందుకు అని అరియానా అడగ్గా.. ఏదైనా ఉంటే నాతో మాట్లాడోచ్చు కదా అంటూ సమాధానమిచ్చింది. ఇక పింకీ అంటే మానస్ గుర్తోస్తాడని అరియానా అనగా.. మానస్ గేమ్ నేను ఆడితే ఇక మా ఇద్దరికి ఓకే ట్రోఫీ ఇచ్చేయ్యొచ్చు కదా అంటూ బదులిచ్చింది. కాజల్ మీద మీ అభిప్రాయం ఏంటీ.. తన ఆట ఎలా ఉంటుంది అని అరియానా అడగ్గా.. ప్రతి విషయాన్ని లాగుతూ ఆ గొడవను ఇంక పెద్దతి చేయాలని చూస్తుందనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. అలాగే షణ్ముఖ్ సైలెంట్ కిల్లర్ అని.. స్ట్రాంగ్ అని.. టాస్కులలో తను చేయాలనుకున్నది ఎలాగైనా చేసేస్తాడని చెప్పింది.