అల్లకల్లోలంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం

అల్లకల్లోలంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం మూలాన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంది.రాష్ట్రానికి మొత్తం మూడు రాజధానులు ఉండబోతున్నాయని ప్రతిపాదన తీసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ వాతావరణం కంటే కూడా నెగిటివ్ వాతావరణమే ఎక్కువగా నెలకొంది.అయితే ప్రభుత్వంలో ఉన్న పార్టీకు అండగా ఉండే ఛానెల్స్ మాత్రం రోడ్డు పైకి ఎక్కిన వారి వార్తలను తొక్కే ప్రయత్నం చేస్తుండగా వారి వ్యతిరేఖ చానెళ్లు మరియు అరకొర ఉండే తటస్థ ఛానెల్స్ వారు మాత్రమే చూపిస్తున్నారు.

ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచింది.కేవలం ఈ ఆరు నెలలలోనే జగన్ పాలనపై ఏపీ ప్రజల్లో చాలా అసంతృప్తి నెలకొంది(కేవలం కొంతమంది జగన్ వీరాభిమానులు మరియు వైసీపీ నేతల్లో తప్ప.జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల్లో లొసుగులు ముందు చెప్పకుండా తర్వాత మాటలు తెలివిగా మార్చడాలు చాలానే జరిగాయి.ఇసుక కొరత,రైతుల సమస్యలు ఇలా ఎన్నో అంశాలు ఎన్నడూ లేని విధంగా పెను సమస్యల్లా మారాయి.ఇప్పుడు రాజధాని సమస్య దీనితో ఆందోళనకు దిగినటువంటి సామాన్య ప్రజానీకం జగన్ నిర్ణయంతో ఏకీభవించడం లేదు.జగన్ కానీ ఇదే పంథాను కొనసాగిస్తే ఇంకొక్క నెలలో ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం కూలిపోతుంది అని హెచ్చరిస్తున్నారు.