టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్రాజు ఈమద్య గీతాఆర్ట్స్ 2 అంటూ బ్యానర్ స్థాపించి చిన్న చిత్రాలను నిర్మించిన విషయం తెల్సిందే. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ బ్యానర్లో రూపొందిన ‘గీత గోవిందం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకే ఈ చిత్రంను అన్ని ఏరియాల్లో తానే స్వయంగా విడుదల చేయాలని నిర్మాత అల్లు అరవింద్ భావించాడు. కాని చివరి నిమిషంలో ఏమైందో కాని కొన్ని ఏరియాల్లో సినిమాను అమ్మేసినట్లుగా సమాచారం అందుతుంది. కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లతో కలిసి విడుదల చేస్తున్నాడు.
‘గీత గోవిందం’పై చాలా నమ్మకం పెట్టుకున్న అల్లు అరవింద్ ఎందుకు ఇలా పట్టు సడలించాడు అనేది ప్రస్తుతం సినీ వర్గాల వారిలో చర్చనీయాంశం అవుతుంది. తాజాగా శ్రీనివాస కళ్యాణం చిత్రంతో దిల్రాజు తీవ్రంగా నష్టపోయాడు. ఆ కారణంగానే అల్లు అరవింద్ ఈ చిత్రం విషయంలో ఛాన్స్ తీసుకోవాలని భావించడం లేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్ని ఏరియాల్లో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సొంతంగా విడుదల చేస్తున్నాడని కొందరు అంటున్నారు. మొత్తానికి గీత గోవిందం విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో అంటూ సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.