చాల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళి సినిమాల్లో నటిస్తున్నారు. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబందించిన ఫోటోలు తాజాగా లీక్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఫొటోలు లీక్ కావడం తో పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత దిల్ రాజు కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న 26 వ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఈ చిత్రానికి సంబందించిన లీక్డ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేసినా వారికీ ఒక సంవత్సరం జైలు శిక్షా మరియు 5000 రూపాయల జరిమానా వేయాల్సిందిగా నిర్మాత కోరడం జరిగింది.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ గా వున్నారు. పవన్ తదుపరి చిత్రం క్రిష్ తో చేయనున్నాడు. అయితే ఆ తర్వాత చిత్రం హరీష్ శంకర్ చిత్రంలో నటించనున్నారు. పవన్ రాజకీయాల్లో ఉంటూనే , సినిమాల్లో బిజీ గా నటిస్తున్నారు. పవన్ నటిస్తున్న ఈ మూడు చిత్రాల ఫై అభిమానులు ఇప్పటికే సంతోషం వ్యక్తం చేస్తున్నారు.