హీరోయిన్ల‌పై నిర్మాత భార్య అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు

Gnanavel Raja Wife Neha says Heroines worse than sex workers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సినిమా రంగంలో హీరోయిన్ల గురించి ఎక్కువ‌మంది మాట్లాడుకుంటూ ఉంటారు. అదేస‌మ‌యంలో వారిపై విమ‌ర్శ‌లూ ఎక్కువ‌గానే చేస్తారు. కాస్ట్ కౌచింగ్ చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చిన త‌ర్వాత ఈ వ్యాఖ్య‌లు మ‌రింత ఎక్కువ‌య్యాయి. ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల సాధ‌కబాధ‌కాల గురించి ఓ ప‌క్క చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే… మ‌రో ప‌క్క వారి వ్య‌వ‌హారిశైలిని త‌ప్పుబ‌ట్టే సినీ జ‌నాల సంఖ్యా పెరుగుతోంది. మొన్న‌టికి మొన్న హిందీ సీరియ‌ళ్ల నిర్మాత ఏక్తాక‌పూర్ కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ అన్ని నింద‌లూ నిర్మాత‌ల‌పై వేయ‌డం స‌రికాద‌ని, హీరోయిన్లే అవ‌కాశాల కోసం అర్ధ‌రాత్రులు నిర్మాత‌లను క‌లుస్తార‌ని అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ద‌క్షిణాదికి చెందిన ఓ నిర్మాత భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ప్ర‌ముఖ త‌మిళ నిర్మాత జ్ఞాన‌వేల్ రాజా స‌తీమ‌ణి నేహా హీరోయిన్ల‌ను వేశ్య‌ల‌తో పోల్చింది. హీరోయిన్లు పచ్చ‌ని సంసారాలు కూల్చేవార‌ని, అయితే త‌ను అంద‌రు హీరోయిన్ల‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం లేద‌ని, కొంద‌రికి మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంద‌ని, త్వ‌ర‌లోనే వారి పేర్లు బ‌య‌ట‌పెడ‌తాన‌ని ఆమె ట్వీట్ చేసింది. మౌనంగా ఉండాలా…? తుఫాన్ లా విజృంభించాలా…?

నేను రెండోదే ఎంచుకున్నాన‌ని, మ‌హిళ‌లే మ‌హిళ‌ల‌కు శ‌త్రువులవుతున్నారని, త‌ప్పుడు దారిలో న‌డుస్తూ… ఆనందంగా జీవిస్తున్న వారి కుటుంబాల్లో క‌ల‌హాలు సృష్టించే ఇలాంటి వారిని శిక్షించాల‌ని నేహ త‌న ట్వీట్ లో ఘాటు ప‌ద‌జాలంతో మండిప‌డింది. ఇంటిలో భ‌ర్త‌ను నియంత్రించ‌డం భార్య బాధ్య‌త‌ని, ఇదే సూత్రం భార్య‌ల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని, బ‌రితెగించిన భార్య‌ను నియంత్రించాల్సిన బాధ్య‌త కూడా భ‌ర్త‌కు ఉంద‌ని, ఇలాంటి మ‌హిళ‌ల‌ను ప‌బ్లిక్ లో కొడ‌తాన‌ని, బ‌హిరంగంగా హెచ్చ‌రిస్తున్నాన‌ని, వీరిని వ‌ద‌ల‌కూడ‌ద‌ని, త్వ‌ర‌లో వారి పేర్లు కూడా బ‌య‌ట‌పెడ‌తాన‌ని హెచ్చ‌రించింది. నేహా ట్వీట్లు కోలీవుడ్ లో పెనుదుమారం రేపాయి. దీంతో త‌ర్వాత స్పందించిన నేహా త‌న ట్వీట్లు డిలీట్ చేసి… కొత్త ట్వీట్లు పెటింది. కొన్ని సున్నిత‌మైన విష‌యాలు వినోదానికి స‌రికావ‌ని, తాను చేసిన పోస్ట్ త‌న సొంత స‌మ‌స్య కాద‌ని, త‌న భ‌ర్త‌తో త‌న‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని, త‌న చుట్టూ జరుగుతున్న సంఘ‌ట‌న‌ల గురించి మాట్లాడానని ఆమె ట్వీట్ చేసింది.

పెళ్లిచేసుకున్న పురుషుల జీవితాల్లోకి కొంద‌రు మ‌హిళ‌లు ప్ర‌వేశిస్తున్నార‌ని ఆరోపించింది. ప్ర‌చారం కోసం తానీ ట్వీట్లు చేయ‌లేద‌ని, సోష‌ల్ మీడియా చాలా శ‌క్తిమంత‌మైనద‌ని, అందుకే తాను దీన్ని ఎంచుకున్నాన‌ని, అయితే విమ‌ర్శ‌లు వ‌స్తున్నందున పాత ట్వీట్లు డిలీట్ చేశాన‌ని, ద‌య‌చేసి బాధ్య‌త‌గా మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఆమె కోరింది. నేహా భ‌ర్త జ్ఞాన‌వేల్ రాజా అనేక హిట్ సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. గ్యాంగ్, సింగం 3 సినిమాల‌కు ఆయ‌నే నిర్మాత‌. సింగం 3 కి నేహా కాస్ట్యూమ్ డిజైన‌ర్ గా ప‌నిచేసింది.

Gnanavel Raja Wife Neha says Heroines worse than sex workers