అనుష్క కొత్త లుక్ కోసం భారీగా ఖర్చు పెడుతున్న నిర్మాతలు

అనుష్క కొత్త లుక్ కోసం భారీగా ఖర్చు పెడుతున్న నిర్మాతలు
అనుష్క సన్నబడిపోయిందంటూ ప్రచారం చేసారు కానీ నిజానికి ఆమెలో ఆట్టే మార్పులేమీ రాలేదు. నిశ్శబ్ధం చిత్రంలో అనుష్క ఫిజిక్‌ని గ్రాఫిక్స్‌ ద్వారా కరక్ట్‌ చేస్తున్నారు. ఆమెని కాస్త సన్నగా చూపించడం ఈజీగా వుండే బట్టలే ఏరి కోరి వేసారు. అయితే క్లోజప్‌ షాట్స్‌లో ఆమె ముఖాన్ని సన్నగా చూపించడానికి, డబుల్‌ చిన్‌ కరక్ట్‌ చేయడానికి చాలా కష్టపడుతున్నారట. ఇలాంటి కరక్షన్స్‌కి విపరీతమైన ఖర్చు అవుతుందని, అయినప్పటికీ అనుష్కకి వున్న క్రేజ్‌ వల్ల ఈ అదనపు ఖర్చుని భరిస్తున్నారని సమాచారం. అనుష్క తన వంతుగా బరువు తగ్గడానికి ప్రయత్నాలు చేస్తూనే వున్నా కానీ నలభైకి దగ్గర పడుతోన్న ఆమె శరీరం అందుకు సహకరించడం లేదట.
సైజ్‌ జీరో టైమ్‌లో ఎంతమంది వద్దని వారిస్తున్నా కానీ అనుష్క రిస్క్‌ చేసి వెయిట్‌ పుట్‌ ఆన్‌ చేసింది. ఇప్పుడు అదే ఆమెకి పెద్ద సమస్యగా మారింది. అగ్ర హీరోల సినిమాలలో ఆమెని తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. కానీ చిన్న బడ్జెట్‌ సినిమాలకి అనుష్క వల్ల అడ్వాంటేజ్‌ వుంటుంది కనుక వాళ్లు మాత్రం ఈ అదనపు ఖర్చుకి సిద్ధపడే ఆమెని సైన్‌ చేసుకుంటున్నారు. మరి ఈ ఫోటోషాప్డ్‌ వెర్షన్‌ ఆఫ్‌ అనుష్క ఏమాత్రం ఆకట్టుకుంటుందనే దానిపై ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయా రాదా అనేది తేలిపోతుంది.