Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాకినాడ జేఎన్టీయూలో సోషల్ మీడియా ఫర్ సొసైటీ నిర్వహించిన సమాజం- సోషల్ మీడియా సదస్సులొ ప్రొ. కే నాగేశ్వర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు
-తెలుగు రాష్ట్రాలలోనే తొలిసారిగా సోషల్ మీడియా ఉన్న వారి కోసం ఎస్ఎంఎస్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం
-ఫేస్ బుక్ లో ఉన్నవాళ్లందరినీ కలుపుకుంటే ప్రపంచంలో జనాభారీత్యా మూడో పెద్ద దేశం అవుతుంది.
-లాటిన్ అమెరికా దేశాల్లో యూట్యూబ్ ఆధారంగా వ్యవసాయం సాగుతోంది. ఆత్మహత్యలకు కూడా సోషల్ మీడియా లైవ్ వాడుతున్నారు
-సోషల్ మీడియా సాయంతో ప్రజా ప్రతిఘటన, ఉద్యమాలు కూడా సాగుతున్నాయి
– Social media is a platform for all forms of diversion extreme actions కాబట్టి ఇది మరింత విస్తృతం కాబోతోంది
– దేశంలో ప్రస్తుతం 20 కోట్లమంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులున్నారు.
– కమ్యూనికేషన్స్ రంగంలో వస్తున్న మార్పులతో సోషల్ మీడియా గణనీయంగా పెరగబోతోంది. అది కొందరికి చికాకుగా కూడా ఉంది. కొందరికి జీవితకాల లక్ష్యంగా మారిపోతోంది.
-ప్రస్తుతం సోషల్ ఇంటరాక్షన్ అంతా ఆన్ లైన్ ఇంటరాక్షన్ గా మారిపోతోంది.
-స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు టీవీగా, ఆన్ లైన్ రేడియోగా, న్యూస్ పేపర్ గా, వర్క్ స్టేషన్ గా, భావోద్వేగాలకు వేదికగా, ఆశయాలు, ఆలోచనలకు కేంద్రంగా మారిపోతోంది. చివరకు ఒక ప్రభుత్వంగా మొబైల్ గవర్నెర్స్ పేరుతో పనిచేస్తోంది.
-మార్కెటింగ్ ప్లాట్ ఫామ్ గా సోషల్ మీడియా మారిపోయింది. బాహుబలి సినిమా కోసం రాజమౌళి చేసిన ప్రయత్నం ఫలితాన్నివ్వడం అందులో భాగమే.
-సోషల్ మీడియా ఇప్పుడు మనకు తెలియకుండానే మనల్ని నడిపించే స్థాయిలో ఉంది.
– సోషల్ మీడియా ఇప్పుడు విశ్వ వీధిగా ప్రపంచాన్ని నిర్ధేశించే స్థాయికి చేరుకుంది.
– పచ్చి అశాస్త్రీయ అంశాలు పంచడానికి ఒకవైపు, విజ్ఞానం పెంచడానికి మరోవైపు సోషల్ మీడియా ఉపయోగపడుతోంది
-ప్రభుత్వాలను ప్రశ్నించడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతోంది. ఈజిప్ట్ ఉదాహరణ
– మీడియాలో ఉన్న వారికి తమను మించిన వారు లేరనే భ్రమలుంటాయి. అదే రీతిలో సోషల్ మీడియా ప్రతినిధులు కూడా కొందరు కనిపిస్తున్నారు. ఈజిప్ట్ లో ప్రజలను కదిలించి ఈజిప్ట్ దానికి ప్రత్యామ్నాయం అందించలేకపోయింది.
– ఢిల్లీలో యువతను కదిలించిన సోషల్ మీడియా నిర్భయ చట్టం తీసుకురాగలిగిందే తప్ప నిర్భయ లాంటి ఘటనలను ఆపలేకపోయింది.
– సోషల్ మీడియా సాయంతో ప్రపంచాన్ని మార్చలేకపోయినా ప్రభావం మాత్రం, శక్తి మాత్రం సామాన్యం కాదు.
– సోషల్ మీడియా శక్తివంతమైన సాధనం కాబట్టే ప్రపంచంలో మిగిలిన మీడియా సాధనాల కన్నా ఎక్కువ ప్రభావం చూపగలుగుతోంది.
-టీవీ, పత్రిక నిర్వహించాలనుకున్నా సాధ్యం కాని వారందరికీ సోషల్ మీడియా సాయంతో ఆలోచనలు పంచుకోవచ్చు.
-ఖర్చు లేకుండా డబ్బున్న వాళ్ల చేతుల్లో ఉన్న మీడియా ఆధిపత్యాన్ని సోషల్ మీడియా ఛేధించగలుగుతుంది.
– బ్లాగర్స్ ని ఇప్పటికే అమెరికాలో జర్నలిస్టులుగా గుర్తించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కూడా ఆహ్వానిస్తోంది.
– ప్రధానస్రవంతి మీడియా మౌనంగా ఉండడం ద్వారా విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా ఆపే ప్రయత్నం చేస్తున్న సమయంలో సోషల్ మీడియా ఉతికి ఆరేస్తోంది.
– సాంకేతిక పరిజ్ఞానికి ద్వంద్వ స్వభావం ఉంటుంది. రక్తం కావాలంటే ఒక పోస్ట్ తో వందల మంది రక్తదాతలు ముందుకు రావడానికి ఉపయోగపడుతున్న సోషల్ మీడియాలో కొన్ని అపశృతులు కనిపిస్తున్నాయి.
– టెక్నాలజీని వాడుకోవడాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి.
– అవసరాలున్న కోట్ల మంది ప్రజలకు గొంతుగా సోషల్ మీడియా ఉపయోగపడుతోంది.
– ప్రజాస్వామ్యం వికసించాలంటే నిరసించే, ప్రశ్నించే హక్కు ఉండాలి. దానికి సోషల్ మీడియా ఆయుధంగా మారుతోంది.
– ఏ సమాజంలో భిన్న ఆలోచనలు ఉంటాయో ఆ సమాజమే పురోగతి సాధిస్తుంది.
– గౌతమబుద్ధుడు 7వేల సంవత్సరాల క్రితమే ప్రజల మధ్య ఒప్పందమే ప్రభుత్వంగా అభివర్ణించారు. భారతీయ నాగరికతలోనే ఆలోచనల ఘర్షణ ఉంది. ప్రశ్నించే స్వభావాన్ని విదేశీయత అనడం సరికాదు.
– పనికిమాలిన పోస్టులకు సోషల్ మీడియా కేంద్రంగా మారుతోంది. మెజార్టీ అంశాలు అవే ఉన్నాయని పరిశీలనలో తేలింది.
-సమాజం కోసం సోషల్ మీడియా వినియోగించాలనుకునేవాళ్లంతా ముందు అబద్ధాలు, అర్థసత్యాల విషయంలో స్పందించాలి.
-సోషల్ మీడియా అద్భుత అవకాశం కాబట్టి, దానిలో విచక్షణ రహిత వినియోగాన్ని ప్రశ్నిస్తూ ముందుకు సాగాలి. అది జరగాలంటే సోషల్ మీడియాలో ప్రజాకాంక్షతో ఉన్నవారి జోక్యం పెరగాలి.
– ఫేస్ బుక్ ఒక పెద్ద ఫేక్ బుక్ అన్నట్టుగా చెబుతున్నారు. ఎక్కువ అబద్ధాలకు ఫేస్ బుక్ కేంద్రంగా ఉంది. చివరకు ఈ అబద్ధాల మీద ఫేస్ బుక్ యాజమాన్యం ఓ కమిటీ వేసింది.
– సోషల్ మీడియాలో మనకు తెలియకుండానే, ఆలోచించే సమయం లేకుండా పోవడంతో వల్గారిథమ్ మీద ఆధారపడిన ఈ సాంకేతిక విజ్ఞానం మనల్ని నడిపిస్తుంది.
-మనమేం చూడాలి, ఏం ఆలోచించాలన్నది మనం నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది.
– సోషల్ మీడియా మాఫియా సైన్యం కూడా ఉంది. ఒక పోస్ట్ పెడితే వారి మీద విరుచుకుపడి , ఇష్టారాజ్యంగా తిట్టడం సాధారాణాంశం అయ్యింది.
– ఆంధ్రాపప్పు అని టైప్ చేస్తే మనిషి ఫోటో రావడం అనేది వ్యక్తిత్వం మీద దాడి. క్రిమినల్ అవుట్ లుక్ తో కొందరు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు.
– సోషల్ మీడియాని బాధ్యతారాహిత్యంగా వినియోగించుకోవడం అంటే స్వేచ్ఛ మీద దాడి చేయడమే.
– భారత రాజ్యాంగం ప్రకారం విశృంఖల స్వేచ్ఛను అనుమతించదు. బాధ్యతారహితంగా ఎదుటివారి స్వేచ్ఛను హరించే రీతిలో కాకుండా సహేతుక ఆంక్షల మధ్యనే స్వేచ్ఛ ఉంటుంది.
– సోషల్ మీడియాలో కూడా స్వీయ ఆంక్షలతో వ్యవహరించాలి. లేకుంటే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఆంక్షలు పెట్టే అవకాశం కల్పించినట్టవుతుంది.
– సోషల్ మీడియాలో విశృంఖలత్వాన్ని వ్యతిరేకిస్తూనే, ప్రభుత్వ ఆంక్షలను నిరసించాలి.
– సోషల్ మీడియాలో హేట్ మాంగరింగ్ పెరుగుతోంది. ముస్లీంలకు ఇద్దరు, ముగ్గురు భార్యలంటారనే ప్రచారం అలాంటిదే.. దేశంలో వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలే ఉంటే ముస్లీంలు ఇద్దరు ముగ్గురుని ఎలా పెళ్లి చేసుకుంటారు. అయినా అబద్ధం ప్రచారం సాగిస్తున్నారు.
-దక్షిణ భారతీయులతో కలిసి మేం ఉండడం లేదా అంటూ నల్లవాళ్లగా చెప్పే జాత్యాహాంకార నేతలు కనిపిస్తున్నారు.
– సోషల్ మీడియాలో మంచి పోస్టులు, మంచి కంటెంట్ కోసం ప్రయత్నం జరగాలి.
– సోషల్ మీడియాలోనే కాదు మీడియాలో వచ్చే ప్రతీ వార్త నిజం కాదు
-పత్రికలు చదవకపోతే సమాచారం తెలియదు, పత్రికలు చదివితే తప్పుడు సమాచారం తెలుస్తుంది. అందుకే జాగురుకత ఉండాలి.
– సోషల్ మీడియా షేరింగ్ లో కూడా జాగ్రత్తలు పాటించాలి.
– సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఒక్క క్షణం ఆగి, ఆలోచిస్తే అర్థమవుతోంది. పూర్తిగా చూడకుండా షేర్ చేసే అలవాటు ప్రమాదం.
– సోషల్ మీడియాలో విచక్షణ అత్యవసరం.
-సోషల్ మీడియా సాయంతో ప్రజలను కదలించే అవకాశం ఉంది. అందుకే నెటిజన్స్ అంతా సిటిజన్ జర్నలిస్టులుగా మారాలి. వివిధ తరగతుల సమస్యలు సహా అన్నింటినీ ప్రస్తావించే ప్రయత్నం చేయాలి.
– మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రభావితం చేసే స్థితిలో ఉన్న సోషల్ మీడియా మరింత చొరవగా వినియోగించుకుని ప్రజావసరాలకు తగ్గట్టుగా మలచుకోవాలి.
– ప్రభుత్వం ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. వాటిని సంఘటితంగా ఎదుర్కోవాలి. ఆన్ లైన్ వేదికగా ఉన్న సోషల్ మీడియా ఫర్ సొసైటీ లాంటి సంస్థలను బలోపేతం చేసుకోవాలి.