వ్యభిచార గృహంపై దాడి

వ్యభిచార గృహంపై దాడి

హుబ్లీ తాలూకా వరూరు గ్రామంలోని ఎస్‌జీ టవర్స్, అమృత కంఫర్ట్‌ హోటల్‌లో వేశ్యావాటిక నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేశారు. యజమాని వెంకటేష్‌ నాయక్, మేనేజర్‌ వీరేష్‌ మురుడేశ్వర, కేఎం.ప్రదీప్‌గౌడ, మంజునాథ గౌడను అరెస్ట్‌ చేశారు.

అక్కడ చిక్కుకుపోయిన యువతులను రక్షించారు. నిందితులు పొరుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలను పిలిపించి ఆన్‌లైన్‌ ద్వారా విటులను రప్పించే వారని పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.