‘గరుడవేగ’ పెట్టింది ఎంత? వచ్చింది ఎంత?

PSV Garudavega Collections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ దాదాపు దశాబ్దం కాలంగా సక్సెస్‌లు లేక సినిమాల సంఖ్య చాలా తగ్గించాడు. ఈ పది సంవత్సరాల్లో రాజశేఖర్‌ నటించింది కొన్ని సినిమాలే అయినా కూడా ఆ కొన్ని సినిమాలు కూడా బాక్సాపీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డవి. తాజాగా ‘గరుడవేగ’ చిత్రాన్ని ఏకంగా 25 కోట్ల బడ్జెట్‌తో చేయడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ చిత్రం థియేట్రికల్‌ రైట్స్‌ను అన్ని ఏరియాలకు కలిపి కనీసం 15 కోట్లకు కొనేందుకు కూడా డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాలేదు. రాజశేఖర్‌ కెరీర్‌లో 10 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్‌ పెడితే అది సాహసమే అనే విషయం అందరికి తెలుసు. కాని దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు నమ్మకంతో ఈ చిత్రాన్ని చేశాడు. రాజశేఖర్‌పై 10 కోట్లు పెట్టడమే ఎక్కువ అని భావిస్తున్న తరుణంలో నిర్మాతలను ఒప్పించి ఏకంగా 25 కోట్లను పెట్టించి సక్సెస్‌ అయ్యాడు.

 PSV Garudavega Movie Collections

వారం రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన గరుడవేగ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకుంది. రాజశేఖర్‌కు చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రంతో సక్సెస్‌ దక్కింది. మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం 15 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను రాబట్టినట్లుగా సమాచారం అందుతుంది. ఇక శాటిలైట్‌ రైట్స్‌, ఆన్‌లైన్‌ రైట్స్‌, ఆడియోరైట్స్‌, ప్రైమ్‌ వీడియో రైట్స్‌ ఇలా అన్ని రైట్స్‌ కలిపి మరో పది కోట్లకు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉంది. కలెక్షన్స్‌ రూపంలో లాంగ్‌ రన్‌లో మరో పది కోట్లు రాబట్టగలదనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. అంటే మొత్తంగా ఈ చిత్రం 30 కోట్లను రాబడుతుంది. అంటే బడ్జెట్‌ పోను నిర్మాతలకు అయిదు కోట్ల మేరకు మిలిగే అవకాశాలున్నాయని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.