అభిమానులని మోసం చేసిన పునర్నవి

అభిమానులని మోసం చేసిన పునర్నవి

ఈ మధ్య తమిళ కథానాయిక ప్రియా భవాని శంకర్.. హరీష్ కళ్యాణ్ అనే తమిళ నటుడితో కలిసి చాలా క్లోజ్‌గా ఫొటోలు దిగి తామిద్దరం ప్రేమలో ఉన్నట్లుగా లవ్ సింబల్స్ పెట్టి సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈ అమ్మాయి అతడితో ప్రేమలో పడిందా.. ఇది నిజమా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. తమిళ మీడియాలో కూడా ఈ మేరకు వార్తలొచ్చేశాయి. కానీ తీరా చూస్తే అదంతా ఓ సినిమా ప్రమోషన్లో భాగం అని తర్వాత తేలింది. ‘పెళ్ళిచూపులు’ రీమేక్ అనౌన్స్‌మెంట్ ముంగిట ఆ చిత్రానికి హైప్ తేవడానికి ప్రియ, హరీష్ కలిసి ఆడిన డ్రామా అది.

ఇప్పుడు ఓ తెలుగమ్మాయి కూడా ఇదే తరహా డ్రామా ప్లే చేసి అందరినీ ఫూల్స్‌ను చేసింది. ఆమె తాజాగా ఎంగేజ్మెంట్ రింగ్ ఉన్న చేతిని చూపిస్తూ తాను ఎంగేజ్ అయిపోయాననే సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆమెకు కాబోయే వరుడెవరు అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

ఓవైపు రాహుల్ సిప్లిగంజ్‌తో అంత సన్నిహితంగా మెలిగి, ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందేంటి అనే చర్చ కూడా నడిచింది. కానీ ఆ చర్చకు త్వరగానే తెరదించేసిందామె. తాను ఎవరితో రింగు తొడిగించుకుందో ఈ రోజు ఆమె వెల్లడించింది. పునర్ణవికి జోడీగా ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్న ఉద్భవ్ రఘునందనే ఆ వ్యక్తి అని ఈ రోజు అసలు విషయం బయటపెట్టింది. వీళ్లిద్దరూ కలిసి ‘ఆహా’ కోసం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ ‘రింగ్’ డ్రామాను ప్లే చేశారన్నమాట.