ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు.ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పునీత్ కుటుంబసభ్యులను కర్ణాటక సీఎం బొమ్మై పరామర్శించారు. ఇక పునీత్ పరిస్థితిని తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రికి వద్దకు భారీగా చేరుకుంటున్నారు.పునీత్‌ని అభిమానులు ఎంతో ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు.
లెజెండరీ నటుడు కంఠీరవ రాజ్‌కుమార్ మూడవ కొడుకే పునీత్ రాజ్‌కుమార్. 1985లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన పునీత్..ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా మారిన ఆయన ఇప్పటివరకు దాదాపు 29కి పైగా సినిమాల్లో నటించారు.