మరికొన్ని రోజుల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో . సీఎం పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అదే పంథాలో నడుస్తోంది. 10 సూత్రాలతో ‘పంజాబ్ మోడల్’ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల ముందుకొచ్చారు .
ఈ మేరకు ఆప్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు 10 సూత్రాలతో ‘పంజాబ్ మోడల్’ను సిద్ధం చేశామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.. సంపన్నమైన పంజాబ్‌గా తీర్చిదిద్దుతామని ఫలితంగా ఉపాధి కోసం కెనడా వెళ్లిన యువత తిరిగి ఇక్కడకే వచ్చి ఉద్యోగం చేసుకునేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మరోవైపు తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది వచ్చే వారం ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.