“పూరి యాక్షన్ ఫిల్మ్ – హీరో ఎవరో తెలుసా …!

"Puri Action Film - Do you know who the hero is...!
"Puri Action Film - Do you know who the hero is...!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన మూవీ “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ కొత్త మూవీ పరిస్థితి ఏమిటి ? అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య బాలయ్య బాబు కోసం పూరి ఒక పవర్ ఫుల్ కథని రాశాడని, ఆ కథనే ఇప్పుడు బయటకి తీస్తున్నాడని.. బాలయ్యతో పూరి మూవీ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.

ఐతే, పూరి కొత్త మూవీ పై కొత్తగా మరో అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ హీరో గోపీచంద్ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడని, పూరి – గోపీచంద్ కాంబినేషన్ లో మూవీ వస్తోంది అని అంటూ తాజాగా ప్రచారం జరుగుతున్నది . గతంలో వీరి కలయికలో గోలీమార్ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ లో మరో మూవీ వస్తే బాగానే ఉంటుంది. మరి గోపీచంద్ – పూరి కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం గోపీచంద్ ‘విశ్వం’ అనే మూవీ లో నటిస్తున్నారు