పూరి – దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో `ఫైట‌ర్`

పూరి - దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో `ఫైట‌ర్`

పూరి జ‌గ‌న్నాథ్ – విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్కింది. ముంబైలో  క్లాప్ కొట్టేశారు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని అన్ని భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌కటించింది. అయితే టైటిల్ మాత్రం చెప్ప‌లేదు. ఈ సినిమాకి ‘ఫైట‌ర్’ అనే టైటిల్ పెట్టిన‌ట్టు ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. పూరి మ‌న‌సులోనూ ఫైట‌ర్ టైటిల్ ఫిక్స‌య్యింది. కానీ ఈ రోజు మాత్రం టైటిల్ చెప్ప‌లేదు.

దానికి కార‌ణం.. అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమాని `ఫైట‌ర్` పేరుతోనే విడుద‌ల చేద్దామ‌ని చూస్తున్నారు. తెలుగులో టైటిల్ దొరికేసింది. అయితే మిగిలిన భాష‌ల్లో మాత్రం టైటిల్ దొర‌క‌డం లేద‌ని స‌మాచారం. అన్ని భాష‌ల్లోనూ టైటిల్‌ని రిజిస్ట‌ర్ చేశాకే.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది చిత్ర‌బృందం. త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఫైట‌ర్ పేరుతో టైటిల్ రిజిస్ట‌ర్ అయ్యి ఉంది. ఆయా నిర్మాత‌ల‌తో మాట్లాడి టైటిల్ తీసుకోవాల‌ని పూరి భావిస్తున్నాడు. ఆ టైటిల్ క్లియ‌రెన్స్ వ‌చ్చాకే… ‘ఫైట‌ర్‌’గా అఫీషియ‌ల్‌గా డిక్లేర్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అందుకే టైటిల్‌ని ఇంకా దాచి పెట్టారు.