ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు . టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబల్ ఇస్మార్ట్ మూవీ తో బిజీగా ఉన్నారు. తాజాగా షూటింగ్ టైం లో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన మ్యారేజ్ లైఫ్ గురించి ఇతను భార్య లావణ్య గురించి ఒక కామెంట్స్ చేశారు లావణ్య మూవీ తీసినప్పుడు షూటింగ్ చూడడానికి వచ్చింది అదే మొదటిసారి. బాగా నచ్చి రెండు గంటల సేపు తనని అలానే చూస్తూ ఉండిపోయాను. ఆమె నా పెళ్ళాంగా సరిపోతుందని బాగా ఫీలయ్యాను . తను నన్ను చూడట్లేదు షూటింగ్ చూస్తోంది.
నేను వెళ్లి పరిచయం చేసుకున్నాను అప్పుడప్పుడు కలవడం భోజనానికి వెళ్లడం ఇలా జరుగుతూనే ఉన్నాయి . ఆ అమ్మాయి వస్తుంది అంటే నే స్నేహితులు దగ్గర అప్పు తీసుకునే వాడిని . ఒకసారి ఏదో హోటల్ కు వెళ్ళాము. అసలు నా దగ్గర డబ్బులు కూడా లేవు తినడానికి కూర్చున్నాం. తందూరి చికెన్ ఆర్డర్ చేసి నేనెప్పుడూ తినలేదు ఆమె మాత్రం మొత్తం తినేసింది . నేను షాక్ అయిపోయాను. పెళ్లి చేసుకుందాం అంటే ఆమె ఒప్పుకుంది. ఆ కోడి తినడం చూసే నిన్ను వదిలేద్దాం అనుకున్నాను అని ఆమెకి కొద్దిరోజుల తర్వాత చెప్పాను కానీ ఆరోజు తిన్నట్లు లావణ్య ఇన్ని సంవత్సరాలలో అలా తినడం నేను చూడలేదని పూరి జగన్నాథ్ అన్నారు.