లైగర్ మూవీ డిజాస్టర్‌తో ఘోరమైన పరాజయాన్ని చూసిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసారి డబుల్ హిట్ సాధించాలన్న టార్గెట్‌తో డబుల్ ఇస్మార్ట్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తరువాత హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్, పూరి కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది. ఇస్మార్ట్ శంకర్ గతంలో చేసిన వెండితెరపైన ఏ రేంజ్లో దుమ్ముదులిపిందో అందరికీ తెలిసిందే. అదే ఊపుతో లైగర్ ఫ్లాపును పక్కన పెట్టి డబుల్ ఇస్మార్ట్ పూర్తిగా దృష్టి సారించారు.
పూరి. తాజాగా మూవీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చి అందరి మైండ్ బ్లాక్ చేశారు డైరెక్టర్ . డబుల్ ఇస్మార్ట్‌లో బిగ్ బుల్ పాత్రను బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.సంజయ్ ఎంట్రీతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్ పోతినేని లవర్ బాయ్ గా ఇమేజ్ మరిపోయింది. మాస్ ఇమేజ్ ట్యాగ్‌లైన్ తగిలించుకుని కెరీర్లో ముందుకెళ్తున్నాడు.
ఇప్పుడు లేటెస్టుగా ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’లోనూ దుమ్ముదులిపేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. హీరో కన్ఫామ్ అయినప్పటికి ఇప్పటి వరకు విలన్. అండ్. హీరోయిన్, ఎవరనేదానిపై డెరెక్టర్ క్లారిటీ ఇవ్వలేదు. విలన్‌గా బాలీవుడ్ నటుడినే ఎన్నుకుంటారనే ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది.
ఈ క్రమంలోనే ఆ ప్రచారాన్నే నిజం చేశారు పూరి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ బిగ్బుల్ అనే పాత్రలో కనిపించనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సంజు ఇందులో విలన్ గా ఉన్నారా అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆయన చాలా వరకు చేస్తున్న చిత్రాల్లోనూ సంజయ్ విలన్‌గానే కనిపించనున్నారు. కాబట్టి ఈ డబుల్ ఇస్మార్ట్‌లోనూ ఆయనే విలన్ అని అందరూ అనుకుంటున్నారు.