ప్లాన్ లో పూరీ మైండ్ బ్లోయింగ్..డబుల్ ఇస్మార్ట్‎లో బాలీవుడ్ స్టార్..?

Ram Pothineni
Ram Pothineni

లైగర్‌ మూవీ డిజాస్టర్‎తో ఘోరమైన పరాజయాన్ని చూసిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసారి డబుల్ హిట్ సాధించాలన్న టార్గెట్‎తో డబుల్ ఇస్మార్ట్‌ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తరువాత హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని హీరోగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్, పూరి కాంబోలో వస్తున్న రెండో చిత్రం ఇది. ఇస్మార్ట్ శంకర్ గతంలో చేసిన వెండితెరపైన ఏ రేంజ్‎లో దుమ్ముదులిపిందో అందరికీ తెలిసిందే. అదే ఊపుతో లైగర్ ఫ్లాపును పక్కన పెట్టి డబుల్ ఇస్మార్ట్‎ పూర్తిగా దృష్టి సారించారు.

పూరి. తాజాగా మూవీకి సంబంధించి మరో అప్‎డేట్ ఇచ్చి అందరి మైండ్ బ్లాక్ చేశారు డైరెక్టర్ . డబుల్ ఇస్మార్ట్‎లో బిగ్ బుల్‎ పాత్రను బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్‎ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.సంజయ్ ఎంట్రీతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో రామ్‌ పోతినేని లవర్ బాయ్ గా ఇమేజ్ మరిపోయింది. మాస్ ఇమేజ్​ ట్యాగ్​లైన్​ తగిలించుకుని కెరీర్​లో ముందుకెళ్తున్నాడు.

ఇప్పుడు లేటెస్టుగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్​గా వస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లోనూ దుమ్ముదులిపేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. హీరో కన్ఫామ్ అయినప్పటికి ఇప్పటి వరకు విలన్. అండ్. హీరోయిన్, ఎవరనేదానిపై డెరెక్టర్ క్లారిటీ ఇవ్వలేదు. విలన్‎గా బాలీవుడ్​ నటుడినే ఎన్నుకుంటారనే ప్రచారం ఇండస్ట్రీలో జరిగింది.

ఈ క్రమంలోనే ఆ ప్రచారాన్నే నిజం చేశారు పూరి. బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సంజయ్ ​దత్​ బిగ్​బుల్​ అనే పాత్రలో కనిపించనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే సంజు ఇందులో విలన్ గా ఉన్నారా అనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆయన చాలా వరకు చేస్తున్న చిత్రాల్లోనూ సంజయ్ విలన్‎గానే కనిపించనున్నారు. కాబట్టి ఈ డబుల్ ఇస్మార్ట్​లోనూ ఆయనే విలన్ అని అందరూ అనుకుంటున్నారు.