ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘పుష్ప-2’ రికార్డుల వేట కొనసాగుతూ ఉన్నది . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ మూవీ ని థియేటర్లలో ఎంజాయ్ చేసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజుల్లో ఈ ‘పుష్ప-2’ సినిమా ఇండియన్ సినిమా రికార్డులని తిరగరాస్తూ దూసుకెళ్తోంది.
తాజాగా ఈ మూవీ నాలుగు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.829 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నాలుగు రోజుల్లోనే రూ.800 కోట్ల మార్క్‌ని అందుకున్న ఫాస్టెస్ట్ సినిమా గా ‘పుష్ప-2’ చరిత్ర సృష్టించింది.
ఇక ఈ మూవీ జోరు మరో వారం పాటు ఇలాగే కొనసాగడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. దీంతో ఈ మూవీ కలెక్షన్స్ ఎక్కడి వరకు వెళ్తాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అల్లు అర్జున్ నటవిశ్వరూపంతో ఈ మూవీ నెక్స్ట్ లెవెల్‌లో పెర్ఫార్మ్ చేస్తుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీ లో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ మూవీ ని ప్రొడ్యూస్ చేశారు.