ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ మూవీ పుష్ప 2 ది రూల్ అనే చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ నుంచి వచ్చిన ఈ బిగ్గెస్ట్ సీక్వెల్ కోసం ఒక రేంజ్ లో హైప్ నెలకొంది. మరి ఈ సినిమా పై ఉన్న బజ్ ఇప్పుడిది కాదు ఎప్పుడు నుంచో పుష్ప రాజ్ ఇండియా వైడ్ గా ట్రెండ్ లో ఉన్నాడు. అయితే ఈ సినిమా కి ఒక రేంజ్ లో బుకింగ్స్ పాన్ ఇండియా భాషల్లో సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్ సహా హిందీ మార్కెట్ లో పుష్ప రాజ్ మానియా చూపిస్తుండగా జస్ట్ ఈ బుకింగ్స్ తో ఏకంగా 2 మిలియన్ టికెట్స్ బుక్ మై షోలో అమ్ముడుపోయి పుష్ప 2 ఫాస్టెస్ట్ 2 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాగా తెరక్కేక్కిస్తోంది . ఇలా మొత్తానికి పుష్ప 2 రిలీజ్ కి ముందే మరిన్ని భారీ రికార్డులు సెట్ చేస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహించారు.