కరోనా కాలంలో.. అందులోనూ ఓమిక్రాన్ విజృంభిస్తున్న సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ బ్లాక్ బస్టర్ పేరే పుష్ప. డిసెంబర్ 17న రిలీజైన ఈ సినిమా ఇప్పటి వరకు 300 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. 2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడం మాత్రమే కాదు బన్ని కెరీర్ లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు పుష్పరాజ్ .
ఇలాంటి సయమంలో పుష్పరాజ్ సడన్‌గా ఓటీటీకి ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మూవీ జనవరి 7నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రెమ్లోస్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. జనవరి 7 నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది.బాక్సాఫీస్ దగ్గర స్టడీగా వసూళ్లను కొల్లగొడుతున్న ఈ సినిమాను అర్జెంటుగా ఓటీటీలో రిలీజ్ చేయడం చిత్ర యూనిట్‌కి కాస్త చేదు వార్తే.
ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో కొంత వసూళ్లను కొల్లగొడుతున్నాడు పుష్పరాజ్. నార్త్ సైడ్ ఇప్పటికీ కాస్త ఎక్కువగా కాసులను రాబడుతున్నాడు. ఇలాంటి టైమ్‌లో ఓటీటీలోకి ఎందుకు వస్తున్నాడంటే.. ఇది ముందు కుదుర్చుకున్న ఒప్పందమే. జనవరి 14న రాధేశ్యామ్ థియేటర్స్ కు వస్తే పుష్పకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రన్ ఉండదని,అందుకే రిలీజ్ కు ముందే అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకుందట చిత్ర యూనిట్. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం, సంక్రాంతి వరకు పుష్పరాజ్ వసూళ్లకు ఢోకా లేదు. కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ ఎఫెక్ట్ బాక్సాఫీస్‌పై కచ్చితంగా ఉంటుంది. ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల చాలా వసూళ్లు కోల్పోతుందని బన్నీ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.