ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘పుష్ప’ విలన్ మూవీ ..!

'Pushpa' villain movie which has come to streaming in OTT..!
'Pushpa' villain movie which has come to streaming in OTT..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్ మూవీ “పుష్ప” తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన టాలెంటెడ్ మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఫాఫా ఇప్పుడు పలు భారీ మూవీ లు దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లో చేస్తుండగా తన రీసెంట్ మూవీ “ఆవేశం” బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు అయితే తెలుగులో తన మూవీ ఒకటి ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

 

గత 2023లో కేజీయఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ తో దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించిన ఆ మూవీ నే “ధూమం”. మరి ఈ మూవీ ని నేటి నుంచి ఆహా వారు స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చారు. ఇక ఈ మూవీ లో ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళీ ఫీమేల్ లీడ్ లో నటించగా ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా అయితే మేకర్స్ దీన్ని తీసుకొచ్చారు. మరి తెలుగులో ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ఈ మూవీ ని ఆహా వారు స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. అందులో ట్రై చేయవచ్చు.