రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఇజ్రాయెల్ మరియు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ లకు మధ్యన జరుగుతున్న యుద్దాన్ని ఆపడానికి వీరిద్దరి మధ్యన శాంతిని చేకూర్చడానికి రంగంలోకి దిగాడు. వీరిద్దరి మధ్యన ఈరోజు ఫోన్ ద్వారా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కానీ పుతిన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఎంత ఒప్పించడానికి ప్రయత్నించినా ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం నుండి అధికారికంగా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ను నాశనం చేసిన హమాస్ ను పూర్తిగా నాశనం చేసే వరకు యుద్ధం ఆపేది లేదని తెగేసి చెప్పాడట నెతన్యాహు.
కానీ పుతిన్ ఎందుకు రెండు ప్రాంతాల మధ్యానం ఈ రక్తపాతం అంటూ ఎంత సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ పుతిన్ ఒప్పుకోలేదు.ఈ ఫోన్ కాల్ లి భాగంగానే పుతిన్ చనిపోయిన ఇజ్రాయెల్ ప్రజలకు తమ సంతాపాన్ని తెలియచేశారు. కాగా ఇంకెన్ని రోజులు ఈమరణహోమం కొనసాగుతుంది అన్నది తెలియాల్సి ఉంది.