Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గల్ఫ్ సంక్షోభం గురించి మనందరికీ తెలుసు. ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా ఉండే దేశాలు.. ఇప్పుడు ఖతార్ ను వెలేశాయి. మరో దేశమైతే ఈపాటికి కుంగిపోయి కాళ్లబేరానికి వచ్చేది. కానీ ఖతార్ ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటి. అంత తేలిగ్గా ఓటమి అంగీకరించే రకం కాదు. ఇరాన్ నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్న ఖతార్.. పాల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఖతార్ అంటే ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ కు నిషేధం కారణంగా ముప్పు రాకూడదనేది ఖతార్ పట్టుదల. అందుకే పాల దిగుబడి అనూహ్యంగా పెంచాలని డిసైడై.. ఏకంగా నాలుగు వేల ఆవుల్ని విమానాల్లో తరలించేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఆవుల్ని కొనాలన్నా, పర్ఫెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఆర్థిక వనరులు అత్యవసరం. అయితే దానికి లోటు లేదు కాబట్టే ఖతార్ ఏ పనైనా చేయగలుగుతుంది.
గల్ఫ్ దేశాల బ్యాన్ ను ఇప్పటివరకైతే ఖతార్ సమర్థంగా ఎదుర్కుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా మెయింటైన్ చేయగలదనే దానిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఖతార్ దగ్గర ఎల్ఎన్జీ గ్యాస్ వనరులు గల్ఫ్ దేశాలకు అవసరమే. మరి వారు ముందు రాజీకొస్తారా.. లేదంతే ఖతారే మధ్యవర్తుల ద్వారా డీల్ సెట్ చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.