కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నా సరే భారత్ నుంచి బ్రిటన్కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది. వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో భారత్ పేరును చేర్చింది. తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్ 11 నుంచి యూకే వచ్చే భారత ప్రయాణికులు కోవిïÙల్డ్ పూర్తి డోసులు తీసుకున్నట్లైతే క్వారంటైన్ తప్పనిసరి కాదు.
భారత్, పాక్తో కలిపి 37 దేశాల పేర్లను వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో యూకే చేర్చింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న యూకే పౌరులతో సమానంగా ఈ దేశాల నుంచి వచ్చే అర్హులైన ప్రయాణికులను పరిగణిస్తారు. సదరు ప్రయాణికులు బ్రిటన్ ప్రయాణానికి పదిరోజుల ముందు యూకే ప్రకటించిన రెడ్ లిస్ట్ జాబితాలోని దేశాలను సందర్శించి ఉండకూడదు.
అలాగే ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందు నిరి్ధష్ట టీకా డోసులు పూర్తి చేసుకొని ఉండాలి. వీరికి క్వారంటైన్ మినహాయింపుతో పాటు యూకేలో కాలుమోపాక చేసే తప్పనిసరి టెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుంది. భారత టీకా సరి్టఫికేషన్ను యూకే అక్టోబర్ 11 నుంచి గుర్తించనుందని, ఇరు దేశాల మంత్రిత్వశాఖల చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ తెలిపారు. ఈ అంశంపై నెలరోజులుగా సహకారమందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.