యోగాతో సిగరెట్ కూడా మానిపించవచ్చు, ఎలాగో తెలుసా ?

Quit Smoking With These Types Of Yoga

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యోగా ఆసనాలను అనుసరించటం ద్వారా, శరీరంలో శరీరంలో కలిగే చెడు పరిణామాలని సహజంగా తగ్గించవచ్చు. అంతేకాకుండా, ఈ ఆసనాల వలన రోగనిరోధక వ్యవస్థలో పెంపుదల, ఆక్సిజన్ సరఫరాను పెంచి, శక్తి ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వీటితో పాటుగా సిగరెట్ తాగటాన్ని కూడా మానేసే ప్రక్రియ యోగా సహాయం చేస్తుంది. సిగరెట్ ను మాన్పించే యోగాసనాల గురించి తెలుసుకుందాం.
యోగేంద్ర ప్రాణాయామ – 1

యోగాతో సిగరెట్ కూడా మానిపించవచ్చు, ఎలాగో తెలుసా ? - Telugu Bullet
ఇది చాలా సులభమైన మరియు చాలా సంవత్సరాలుగా సిగరెట్ వలన శరీరంలో కలిగిన ప్రమాదాన్ని తగ్గించే ఆసనంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, రోజు ఈ ఆసనాన్ని అనుసరించటం వలన సిగరెట్ తాగాలనే కోరిక తగ్గిపోతుంది. యోగేంద్ర ప్రాణాయామ-1 ఆసనం, శ్వాసక్రియా శ్వాసక్రియాను సమతుల్యంగా ఉంచటమే కాకుండా, ఉచ్వాస మరియు నిచ్వాసల సమయాన్ని సమానంగా ఉండేలా చేస్తుంది మరియు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచి, చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. సిగరెట్ వలన కళ్ళలో మరియు చర్మంపై ఏర్పడిన ప్రభావాలను కూడా తగ్గించి వేస్తుంది. ఈ ఆసనం ఊపిరితిత్తులకు చాలా ప్రయోజనకరం. యోగేంద్ర ప్రాణాయామ-1 వలన శారీరక భాష మరియు మీపై నమాకాన్ని కూడా పెంచుతుంది.
యోగేంద్ర ప్రాణాయామ-1 ఎలా చేయాలంటే

* ఈ ఆసనంలో ముందు సుఖాసన లేదా, వజ్రాసన భంగిమలో కూర్చిండి.
* సౌకర్యవంతంగా, ఎలాంటి భంగాలు కలుగనట్టి ప్రాంతంలో కూర్చిని, నెమ్మదిగా గాలిని 5 సెకన్’ల పాటూ పీల్చండి. ఇలా రోజు రోజుకి ఈ శ్వాస తీసుకునే సమయాన్ని పెంచండి.
* శ్వాస తీకుకోవటం పూర్తయిన తరువాత, కొద్ది సమయం పాటూ ఊపిరిని బిగబట్టి అదే విధానంలో గాలిని వదులుతూ, అంతే సమయంలో గాలిని వదలండి.
*ఇలా చేయటం వలన ఉచ్వాస, నిచ్వాస సమయం సమానంగా ఉంటుంది.
*ఈ ఆసనాన్ని రోజు ఉదయం మరియు పడుకునే ముందు చేయండి. మెరుగయిన ఫలితాల కోసం రోజు 10 సార్లు అనుసరించండి.
యోగేంద్ర ప్రాణాయామ- 4

యోగాతో సిగరెట్ కూడా మానిపించవచ్చు, ఎలాగో తెలుసా ? - Telugu Bullet

ఈ ఆసనం వలన సిగరెట్ పై మొహం తగ్గటమే కాకుండా, నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ మనస్సును శాంత పరచి, మెదడులోని కీమో రిసెప్టార్’ల సున్నితత్వాన్ని క్రమబద్దీకరిస్తుంది.
యోగేంద్ర ప్రాణాయామ-4 ఎలా చేయాలంటే
* ముందుగా వీపును నేలకు తాకించి పడుకోండి.
* తర్వాత మోకాళ్ళ వద్ద వంచి, రెండు కాళ్ళను జతపరచి, సౌకర్యవంతంగా, శరీరానికి దగ్గరగా తీసుకోండి. అలాగే నెమ్మదిగా మీ చేతిని నాభి ప్రాంతంలో ఉంచండి.
* తరువాత మీ శ్వాసను గమనించండి.
* శ్వాసను తీసుకొన్నపుడు నాభి పైకి వస్తుంది, అలానే 3 సెకన్ల పాటు ఉంచండి.
* శ్వాస వదిలినపుడు, నాభి కిందు చేరుతుంది ఈ సమయంలో కూడా 3 సెకన్ల పాటు అలానే ఉండండి.
కానీ, ఈ ఆసనం అనుసరించే సమయంలో, ఉచ్వాస, నిశ్వాస ప్రక్రియలో చాతి కదలకుండా చూసుకోండి.

ఇక్కడ తెలిపిన రెండు ఆసనాలు ప్త్రత్యేక విశిష్టత కలిగి ఉన్నా , ఆసనాలను అనుసరించే ముందు యోగా నిపుణుల వద్ద శిక్షణ తీసుకోవటం మరవకండి. ఎందుకంటే గుడ్డి విద్య అని పెద్దలు వూరికే అనలేదు సుమీ…నిపుణుల పర్యవేక్షణ లేకుండా చేస్తే కండరాలు పట్ట్టేసి ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్త