విడాకులు తీసుకున్న రాఘవేంద్ర రావు కొడుకు – కోడలు !

Raghavendra Rao's son divorces
తామిద్దరం రెండేళ్ల క్రితమే విడిపోయామని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కోడలు కనిక దిల్లాన్‌ తెలిపారు. భర్త ప్రకాశ్‌ కోవెలమూడి తో మధ్య మనస్పర్థలు వచ్చాయని చెప్పారు. రెండేళ్ల క్రితం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని, స్నేహితుల్లా కలిసున్నామని ఆమె పేర్కొంది.
ప్రకాశ్, కనికలు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పలు బాలీవుడ్ చిత్రాలకు ఇద్దరూ కలసి పని చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’కు వీరిద్దరూ కలసి పని చేశారు. ఈ సినిమాకు ప్రకాశ్ దర్శకత్వం వహించగా, కనిక రచయిత్రిగా ఉన్నారు.
ఈ చిత్రానికి సంబంధించి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి కనిక వెల్లడించారు. అయితే వారికి పెళ్లి అయినా విడిపోయిన విషయం మాత్రం ఇప్పుడే బయటకి వచ్చింది.