Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైఎస్ చనిపోయినప్పట్నుంచీ ఆయన పేరు కోసం కాంగ్రెస్, వైసీపీ కొట్టుకుంటూనే ఉన్నాయి. వైఎస్ జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉన్నా.. ఆయన కుమారుడిగా జగన్ నే రాజకీయ వారసుడిగా గుర్తించారు జనం. కానీ ఏపీ కాంగ్రెస్ మాత్రం పట్టు వదల్లేదు. వైఎస్ తమ పార్టీ సొత్తని, ఆయన కాంగ్రెస్ సీఎం అని డబ్బా కొడుతోంది. వైఎస్ జయంతి రోజు మరోసారి సేమ్ డైలాగ్ రిపీట్ చేశారు మాజీ మంత్రి రఘువీరా.
వైఎస్ చనిపోయారనుకోవడం అవివేకమని, ఆయన జనం గుండెల్లో బతికే ఉన్నారని సెంటిమెంట్ గన్ పేల్చారు. దీంతో జగన్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా.. ఓ పార్టీగానే గుర్తింపు కోల్పోయిన కాంగ్రెస్.. ఇప్పుడు వైఎస్ బ్రాండ్ కోసం చేస్తున్న ప్రయత్నాలు నవ్వులపాలు చేస్తున్నాయి.
అసలు రఘువీరాను ఎంతమంది నమ్ముతున్నారనే విషయంపై క్లారిటీ లేదు. అలాంటి సమయంలో రఘువీరా వైఎస్ భజన చేయడం ఏపీ కాంగ్రెస్ లోనే ఓ వర్గానికి నచ్చడం లేదు. వైఎస్ పేరు వదిలేయాలని కాంగ్రెస్ లో ఓ వర్గం కోరుతున్నా.. రఘువీరా లాంటి వైఎస్ అనుంగు సహచరులు మాత్రం ఆ మాటలు పట్టించుకోవడం లేదు. అందుకే వారిని జనమూ పట్టించుకోవడం లేదు.