Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని సంవత్సరం కావొస్తున్న సందర్భంగా…ఈ అంశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయిందని ఆరోపిస్తున్న రాహుల్ …ట్విట్టర్ లో దీనిపై వ్యంగాస్త్రాలు సంధించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఐసీయూలో ఉందని ట్వీట్ చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మెడిసన్లకు ఆర్థిక వ్యవస్థకు పట్టిన జబ్బును నయం చేసే శక్తి లేదని విమర్శించారు.
ఇటీవలే గుజరాత్ లో పర్యటించిన రాహుల్ జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా అభివర్ణించారు. దీనిపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ..2జీ, కోల్ స్కామ్ ల్లో ఇరుక్కున్న నేతలకు జీఎస్టీ ట్యాక్స్ గురించి అభ్యంతరాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అరుణ్ జైట్లీకి రాహుల్ కౌంటర్ ఇచ్చారు. నవంబరు 8కి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఏడాది గడుస్తోంది. ఆ రోజును బ్లాక్ డే గా పాటించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరపాలని కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు భావిస్తున్నాయి. దానికి ప్రతిగా ఆ రోజును నల్లధన వ్యతిరేక దినంగా జరుపుతామని అరుణ్ జైట్లీ ప్రకటించారు.