తెలంగాణలో ఏపీ వాణి వినిపించిన రాహుల్ !

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ కూడ అబద్దపు హమీలిచ్చి పబ్బం గడుపుకొంటున్నారని రాహుల్ విమర్శలు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సోమవారం నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రసంగించారు. నాలుగేళ్లుగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇద్దరీ స్టైల్ ఒకటేనని రాహుల్ మోడీ ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షల ఖాతాలో వేస్తామన్నారు. తెలంగాణలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు ఇలాంటి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో ఇద్దరూ ఇద్దరేనని రాహుల్ విమర్శించారు. రాఫెల్ ఒప్పందం విషయంలో బయటకు చెప్పకూడదని ఒప్పందం ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన గుర్తుచేశారు.

Rahul Gandhi claims Rafale dealకానీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో తాను ఈ విషయాన్ని అడిగినట్టు చెప్పారు. ఈ ఒప్పందాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని ఫ్రాన్స్ అధ్యక్షుడు తనతో చెప్పారని ఆయన ప్రస్తావించారు. దళితులకు మూడుఎకరాల ఇళ్లను నిర్మించనున్నట్టు కేసీఆర్ హమీ ఇచ్చారని చెప్పారు. మరో వైపు ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. మోడీ కూడ ఇదే తరహాలో నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలను ఇస్తామని ఇచ్చిన హమీని ప్రస్తావిస్తూ ఇద్దరూ కూడ అబద్దపు హమీలు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవలంభించిన విధానాల కారణంగా 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారని ఆయన చెప్పారు.కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ప్రజలు సమస్యలను పరిష్కరిస్తామని రాహుల్ గాంధీ హమీ ఇచ్చారు. దేశ చరిత్రలోనే తొలిసారి మీడియా స్వేచ్చగా రాయలేకపోతుందని ఆ విధంగా భయపెడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ప్రత్యేకా హోదా ఇవ్వమని విభజన చట్టంలో రాసి ఉంటె హోదా ఇవ్వకుండా ఏపీ హక్కులని కాలరాసారని రాహుల్ పేర్కొన్నారు. అలా ఇవ్వనప్పుడు నిలదీయడం రాష్ట్రాల హక్కు అని ఏపీ నిలదీస్తున్నట్టు తెలంగాణా ఎందుకు నిలదీయలేకపోతుందని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు ఎపీకి నెరవేరుస్తామని ఆయన ప్రకటించారు. అయితే తెలంగాణా సభలో ఏపీ సమస్యల మీదా రాహుల్ మాట్లాడటం మీద విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సెటిలర్ల వోట్ల కోసం రాహుల్ ఏపీ ప్రస్తావన మాటిమాటికీ తీసుకొస్తున్నారా ? అనే అనుమానాలని వారు వ్యక్తం చేస్తున్నారు.