మీడియా వాళ్లపై ఫైర్ అయిన రాహుల్ సిప్లిగంజ్

మీడియా వాళ్లపై ఫైర్ అయిన రాహుల్ సిప్లిగంజ్

బిగ్ బాస్-3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో అతడి మీద బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు బీర్ బాటిల్స్‌తో దాడి చేయడం కలకలం రేపింది. రాహుల్  గురువారం మధ్యాహ్నం బయటికి వచ్చాడు. బయటికి కనిపించే గాయాలేమీ లేకుండా మామూలుగానే కనిపించాడు. మీడియాతో మాట్లాడాడు. తన స్నేహితుల్ని ఉద్దేశించి చీప్ కామెంట్లు చేసిన వాళ్లతో తనకు గొడవ జరిగిందని.. వాళ్లకు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందని తర్వాత తెలిసిందని.. వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశానని రాహుల్ వెల్లడించాడు.

ఈ సందర్భంగా మీడియా వాళ్లకు, రాహుల్‌కు చిన్న పాటి వాగ్వాదం లాంటిది నడిచింది. మీరు రెగ్యులర్‌గా పబ్బుకు వెళ్తారా అంటూ ప్రశ్నిస్తే రాహుల్‌కు చురుక్కుమంది. ‘‘నేను మనిషినే కదా పబ్బుకు పోవడం తప్పా ఎంజాయ్ మెంట్  కోసం అందరూ వెళ్తారు కదా మీరు బార్లకు వెళ్తారు.. నేను పబ్బుకు పోతాను.. అంతే తేడా’’ అని అతను ఎదురు ప్రశ్నించాడు. ఐతే మేము బార్లకు వెళ్తామని మీకెవరు చెప్పారు మీరు పబ్బుకు పోతారా అని మాత్రమే కదా అడిగాం అంటూ మీడియా వాళ్లు అతడితో రెట్టించి మాట్లాడారు.