బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. తూర్పు మధ్యప్రదేశ్ మధ్య భాగం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్లు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.
రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.