హిట్ డైరెక్టర్ కన్నా యావరేజ్ డైరెక్టర్ కి వెంటనే ఛాన్స్…

Raj Kandukuri Suresh Babu gives Second Movie Chance to Vivek Athreya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
పెళ్లిచూపులు సినిమాతో నిర్మాత రాజ్ కందుకూరి జడ్జిమెంట్ మీద సినీ ఫీల్డ్ లో నమ్మకం పెరిగిపోయింది. అందుకే ఆ సినిమా పూర్తి అయ్యాక అందులో భాగస్వామిగా చేరారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు. ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ పెళ్లిచూపులు సినిమా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన దర్శకుడు తరుణ్ భాస్కర్ కి మంచి పేరు వచ్చింది. ఇండస్ట్రీ అంతా చెప్పుకునే సినిమా చేసిన అతని రెండో సినిమా ఇంకా మొదలు కాలేదు.

ఇక పెళ్లిచూపులు తర్వాత రాజ్ కందుకూరి చేసిన రెండో సినిమా మెంటల్ మదిలో . ఇందులో కూడా సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామి అయ్యింది. ఈసారి వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు. పెళ్లిచూపులు తో పోలిస్తే ఈ సినిమా కలెక్షన్స్ , రివ్యూస్ పరంగా పర్వాలేదు అనిపించింది. వివేక్ ఆత్రేయ యావరేజ్ సినిమా ఇచ్చినా అతనికి వెంటనే ఛాన్స్ దొరికింది. అయితే ఈసారి థ్రిల్లర్ సినిమా చేయబోతున్నారు. రాజ్ కందుకూరి, సురేష్ బాబు లు సూపర్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ని చూసీచూడనట్టు వదిలేసి యావరేజ్ సినిమా ఇచ్చిన వివేక్ కి రెండో సినిమా ఛాన్స్ సెంటవెంటనే ఇచ్చేయడం ఆశ్చర్యంగా వుంది.

అటు పెళ్లిచూపులు చేసిన తరుణ్ భాస్కర్ తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని కొత్త కథ రాసుకుంటున్నాడు. ఈ దర్శకుడు ఈసారి పెళ్ళిచూపులకి పూర్తి కాంట్రాస్ట్ గా వుండే సినిమా తీయాలి అనుకుంటున్నాడు. అయితే ఈ సినిమాని ఇంకా ఏ నిర్మాత ఓకే చేయలేదు. హిట్ డైరెక్టర్ వెయిట్ చేస్తుంటే యావరేజ్ డైరెక్టర్ సీనియర్ నిర్మాతలను ఒప్పించి సినిమా చేయడం చిత్రంగా వుంది.