ఫ్లాప్ కొట్టిన బ్యానర్ లోనే సినిమా చేస్తున్న కుర్ర హీరో !

Raj Tarun's Next With Dil Raju Again

వరుస అవకాశాలతో వరుస విజయాలతో రాజ్ తరుణ్ ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ లా దూసుకెళ్ళారు. అయితే క్రితం ఏడాది ఆయనను వరుస పరాజయాలు పలకరించాయి. దాంతో సహజంగానే అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆయన దిల్ రాజు ప్రాజెక్టులో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ఇంతకుముందు దిల్ రాజు బ్యానర్లో లవర్ తో పరాజయాన్ని చవిచూసిన రాజ్ తరుణ్, మళ్లీ అదే బ్యానర్లో అవకాశాన్ని దక్కించుకోవడం అంటే మాములు విషయం కాదు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణారెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

ఈ సినిమాకి ‘నీది నాది ఒకటే లోకం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా ముందుగా మహేష్ బాబు మేనల్లుడు గల్లలా జయదేవ్ కొడుకు హీరోగా లాంచ్ అయ్యింది. అయితే మరి ఏమనుకున్నాడో ఏమో గానీ ఈ సినిమా వద్దని మహేష్ చెప్పడంతో అ బాబు సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు అదే సినిమాకి రాజ్ తరుణ్ హీరోగా తీసుకున్నాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారంఈ సినిమా మార్చ్ 3వ వారంలో సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడు. చూడాలి మరి ఏమవుతుందో ?