మాట మార్చిన పాక్…అది ఎఫ్-16 కాదట !

Pakistan Takes U turn About f-16 Fighter fit

భారత దాడిలో ఎఫ్-16 విమానం కోల్పోయిన పాక్ అమెరికా ఆగ్రహానికి గురైంది. పాకిస్థాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల ఏరివేత కోసం సరఫరా చేసిన ఎఫ్-16 యుద్ధ విమానాలతో భారత్‌పై దాడికి దిగడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతోంది. దీంతో పాకిస్థాన్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ వాడకం పట్ల వివరణ ఇవ్వాలని పాక్ ని అమెరికా కోరింది. దీంతో పాక్ ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది. తాము భారత్‌పై దాడికి ఉపయోగించిన విమానాలు ఎఫ్-16 విమానాలు కాదనీ, చైనా తయారు చేసిన జేఎఫ్-17 విమానాలని బుకాయించింది. తామసలు ఎఫ్-16 యుద్ధ విమానాన్ని వాడలేదని, చైనా తయారీ అయిన జేఎఫ్-17 యుద్ధ విమానాన్ని వాడామని వివరణ ఇచ్చింది. చైనాతో కలిసి తాము తయారుచేసుకున్న జేఎఫ్-17 విమానంతోనే తాము అభినందన్ మిగ్ విమానాన్ని కూల్చివేశామని ఇప్పుడు చెబుతోంది.

ఇందుకోసం సీఎన్ఎన్ ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది. భారత వాయుసేనకు చెందిన మిగ్ -21 దాడిలో చైనా తయారీ అయిన జేఎఫ్-17 యుద్ధ విమానం ఒకటి కూలిపోయిందని సీఎన్ఎన్ ప్రచురించింది. పాక్ బుకాయింపును భారత వాయుసేన చీఫ్ ధనోవా కొట్టిపడేశారు. తాము కూల్చింది ఎఫ్-16 యుద్ధ విమానమేనని దానికి అమ్రామ్‌ క్షిపణిని కూడా అమర్చారు. ఎఫ్‌-16లకు మాత్రమే వాటిని అటాచ్‌ చేస్తారని భారత వైమానిక దళ చీఫ్‌ ధనోవా స్పష్టం చేశారు.