పోలీసుల లాఠీ ఛార్జ్ : రాజా సింగ్ తల పగిలి తీవ్ర గాయాలు

Raja Singh head wounded and serious injuries

హైదరాబాద్‌లోని జుమ్మెరాత్‌ బజార్‌లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జుమ్మెరాత్ బజార్‌లో అవంతిభాయ్‌ విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో  అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులపై దాడి చేశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలపై కూడా పోలీసులు దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రికత్త ఏర్పడింది. పోలీసుల దాడిలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ తలకు గాయమైంది. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాజాసింగ్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాణి అవంతి బాయ్ విగ్రహంలో కొన్ని లోపాలు ఉండడం వల్ల.. దానిని అక్కడ నుంచి తరలిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. అయితే పోలీసులు ఎలాంటి కారణాలు లేకుండా తమపై దాడి చేశారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. 2009లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఇప్పటి వరకూ రెండు సార్లు మరమ్మతులు చేశామని.. కానీ ఎప్పుడూ ఇలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదని తెలిపారు.. ఈ సారి పోలీసు హద్దులు దాటడం దారుణమన్నారు.