Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : రవి తేజ , మెహ్రీన్ , రాధిక , సంపత్ రాజు , ప్రకాష్ రాజ్ ,రాజేంద్రప్రసాద్
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం : అనిల్ రావిపూడి
మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ : మోహన్ కృష్ణ
ఎడిటర్ : తమ్మిరాజు
మాస్ మహారాజా రవితేజ తెలుగు ప్రేక్షకులకి కనిపించి రెండేళ్లు అయ్యింది. ఇక దిల్ రాజు, రవితేజ కాంబినేషన్ జనాన్ని పలకరించి 12 ఏళ్ళు దాటింది. ఆ ఇద్దరికీ రెండు హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి జత కలిసాడు. ఆ ముగ్గురు కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా రాజా ది గ్రేట్ . టైటిల్ లో పిచ్చ మాస్ టచ్ వున్నా ఈ సినిమాలో మ్యాటర్ మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కారణం ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయే తెలుగు ఇండస్ట్రీలో ఓ స్టార్ స్టేటస్ వున్న నటుడు పూర్తి స్థాయిలో అంధ పాత్రలో నటించడమే. రొటీన్ సినిమాలతో విసిగెత్తి కాస్త గ్యాప్ తీసుకుని మరీ రవి తేజ ఓకే చేసిన సినిమా ఇది.
ఓ మాస్ హీరో ఇలాంటి పాత్ర ఒప్పుకోడానికి చాలా ధైర్యం కావాలి. హీరో ముందుకు వచ్చేట్టు కథ, కధనంలో దమ్ము ఉండాలి. దర్శకుడుకి నిజంగా ఇలాంటి కథ చేయాలంటే ఎంతో దమ్ము ఉండాలి. హీరో, దర్శకుడు ఓకే అనుకున్నా ప్రతిపైసా ఖర్చు పెట్టే నిర్మాత పెద్ద రిస్క్ చేయాలి. ఇలా ముగ్గురు అవుట్ అఫ్ ది బాక్స్ లో ఓ సినిమా చేయడానికి సిద్ధం అయినా దాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ డౌట్ ని టీజర్,ట్రైలర్ తోనే దాటేసింది రాజా ది గ్రేట్. తీసుకున్న పాయింట్, చేస్తున్న ప్రయత్నం కొత్తది అయినా ఎక్కడా వినోదానికి లోటు లేదని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. అంధత్వం సమస్య వున్న హీరో , విలన్ నుంచి హీరోయిన్ ని కాపాడడం అన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న సీన్స్ గురించి ఇప్పటికే ఇండస్ట్రీ లో గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ పాయింట్ ని ప్రేక్షకులు రేపు ఎలా రిసీవ్ చేసుకుంటారో ?.