రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకతని ఎదుర్కొంటున్న మూడు రాజధానుల అంశం

రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకతని ఎదుర్కొంటున్న మూడు రాజధానుల అంశం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పార్టీకి సంబందించిన పలు కీలక నిర్ణయాల్ని ఈరోజు తీసుకోనున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా చర్చంశనీయమైన మూడు రాజధానుల అంశం గురించి కూడా పవన్ మరొకసారి పెదవి విప్పనున్నారు. ఈ సమయం లో పవన్ సమావేశం సర్వత్రా చర్చాంశనీయం అయింది. అయితే ఇక్కడ పెద్ద సమస్య ఉందని చెప్పాలి.పవన్ కళ్యాణ్ జగన్ ప్రతిపాదనని మొదటగా తప్పుబట్టారు. అయితే జీఎన్ రావు నివేదిక ఫై స్పష్టత ఇచ్చాక తన నిర్ణయం తెలపాలని భావించి సైలెంట్ అయ్యారు.

రాజధాని విషయం లో పవన్ అమరావతికి మద్దతిస్తే మిగతా ప్రాంత ప్రజల విషయం లో వ్యతిరేకతని ఎదుర్కొంటాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. మూడు రాజధానుల కి అనుకూలంగా స్పందిస్తే అమరావతి ప్రాంత ప్రజలతో పాటుగా చుట్టు పక్కల జిల్లాల ప్రజల నమ్మకాన్ని కోల్పోతాడు. చంద్రబాబు నాయుడు కక్కలేక, మింగలేక అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తూనే, విశాఖ వాసుల మీద వ్యతిరేకత లేదని తెలిపారు. ఇపుడు పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైసీపీ నేతలు పవన్ తీరు ని ఎండగట్టడం ఖాయం. మరి పవన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.