Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ అగ్ర నిర్మాతలు మరియు హీరోలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అంతటి క్రేజ్‌ను సంపాదించిన రాజమౌళి పేరును ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెడగొడుతున్నాడు అంటూ అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ‘శ్రీవల్లీ’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. పైగా అదో బూతు సినిమా తరహాలో ఉందంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రచయితగా దేశంలోనే టాప్ అనిపించుకున్న విజయేంద్ర ప్రసాద్ ఇలాంటి సినిమాలు తీసి ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకుంటున్నారు అంటూ కొందరు అంటున్నారు. మంచి కథలను అందించే సత్తా ఉన్న ఆయన దర్శకత్వంపై ఆసక్తిని వదులుకోవాలని, మంచి మంచి కథలు మరిన్ని తయారు చేయాలని రాజమౌళి అభిమానులు కోరుకుంటున్నారు. దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్న విజయేంద్ర ప్రసాద్‌కు మరోసారి నిరాశ ఎదురు అవ్వడంతో అంతా షాక్ అవుతున్నారు. రాజమౌళికి కూడా ‘శ్రీవల్లీ’ అంతగా నచ్చిట్లు లేదని అభిమానులు అంటున్నారు. శ్రీవల్లీ సినిమాకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇలాంటి సినిమాలకు రాజమౌళి పేరును వాడటం అంటే జక్కన్న పరువును తీయడమే అని కొందరు అంటున్నారు.