అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ సెట్‌ లో రాజమౌళికి ఏం పని?

Rajamouli in Pushpa 2 set
Pushpa 2

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుపుకుంటోంది. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చివరి దశ చిత్రీకరణ లో అల్లు అర్జున్ తో పాటు సినిమాకు సంబంధించిన కీలక నటీనటులు అంతా ఈ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే రాజమౌళి తాను త్వరలో షూటింగ్‌ ప్రారంభించబోతున్న మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ను చేస్తున్నారట. కొన్ని డమ్మీ సన్నివేశాల చిత్రీకరణ తో పాటు, సెట్స్ కి సంబంధించిన విషయమై రామోజీ ఫిల్మ్‌ సిటీలో రాజమౌళి పనుల్లో బిజీగా ఉన్నారు.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో పుష్ప 2 సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిన రాజమౌళి అక్కడకు వెళ్లి సుకుమార్‌ తో పాటు అందరినీ సర్‌ప్రైజ్ చేశారట. సుకుమార్‌ మేకింగ్‌ స్టైల్‌ అంటే రాజమౌళికి చాలా ఇష్టం. అందుకే ఆయన ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నారట. దాదాపు 30 నిమిషాల పాటు రాజమౌళి అక్కడే ఉన్నారని, చిత్ర యూనిట్‌ సభ్యుల్లో కీలక వ్యక్తులను రాజమౌళికి సుకుమార్‌ పరిచయం చేశారని తెలుస్తోంది. పుష్ప 2 కి సంబంధించిన పలు విషయాలను దర్శకుడు సుకుమార్‌ తో రాజమౌళి చర్చించారట. ఒక షాట్ ను సుకుమార్‌ చిత్రీకరించిన విధానంకు రాజమౌళి ఫిదా అయ్యి అద్భుతం అంటూ అభినందించారట.

పుష్ప 2 సెట్‌ కి రాజమౌళి వచ్చిన సందర్భంగా తీసిన వీడియోను త్వరలోనే ఫ్యాన్స్ కోసం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే ఆ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుష్ప మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సహజంగానే రెండో పార్ట్‌ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్‌ లోనూ పుష్ప 2 కి విపరీతమైన బజ్ క్రియేట్‌ అయింది. అందుకే సుకుమార్‌ చాలా జాగ్రత్తగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.